By: ABP Desam | Updated at : 29 Jan 2022 11:47 AM (IST)
అమ్మాయి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో విషాదం నెలకొంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు నిండు ప్రాణాన్ని తీసుకున్నాడు. సూసైడ్ చేసుకోవడానికి ముందు యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఇప్పుడు జిల్లాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెం వాసి కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు ఆత్మహత్య తూర్పుగోదావరి జిల్లాలోనే సంచలనంగా మారింది. తాను ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయానంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమపేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుంటుందని శంకరరావు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పేందుకు వాట్సాప్‌గ్రూప్‌లు క్రియేట్ చేసి అన్ని గ్రూప్‌లో కూడా ఆ అమ్మాయితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వీడియోలు షేర్ చేశాడు. ఉంగరాలు మార్చుకున్న వీడియో కూడా షేర్ చేశాడు.
శంకరరావుకు ఇప్పటికే పెళ్లి అయిందన్న ప్రచారం సాగుతోంది. ఆ అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు వాళ్లిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని ఆమెతో విడిపోయాడని స్థానికులు చెబుతున్నారు.
మొదటి భార్యతో విభేదాలు ఉన్న పరిస్థితుల్లో ఈ అమ్మాయికి కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. భార్య ఉందన్న విషయాన్ని చెప్పకుండానే ఈ అమ్మాయిని ప్రేమించాడని.. ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయి వేరే పెళ్లికి ఒప్పుకుందని కూడా స్థానికులు అంటున్నారు.
ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పుడు నిండు ప్రాణం పోవడం ఊరిలో తీవ్ర విషాదం నింపింది. వీళ్లిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
Konaseema Name Change Protest: అగ్ని గుండంలా అమలాపురం- కొనసాగుతున్న విధ్వంసకాండ
Konaseema District: అదుపు తప్పిన కోనసీమ జిల్లా ఉద్యమం- నిరసనకారుల దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!