By: ABP Desam | Updated at : 09 Apr 2023 03:53 PM (IST)
Edited By: jyothi
రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన పెనుప్రమాదం ( Image Source : ప్రతీకాత్మక చిత్రం )
Rajadhani Express:: చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ కు నెల్లూరు జిల్లా కావలి వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని ఎక్స్ ప్రెస్ లోని B-5 బోగీలో ఒక్కసారిగా భారీగా పొగలు రాడవంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎక్స్ ప్రెస్ సరిగ్గా కావలి స్టేషన్ సమీపంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. అయితే విషయం గుర్తించిన లోకోపైలెట్ వెంటనే రైలను ఆపివేశాడు. రైలులో ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే రైలులో ఉన్నవారంతా కిందికి దిగిపోయారు. దాదాపు 20 నిమిషాల వరకు రైలుని ఆపి మరమ్మతులు చేశారు. ఎక్స్ ప్రెస్ బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఆ బోగీ వద్ద పొగలు వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదు. మరమ్మతుల తర్వాత, రాజధాని ఎక్స్ ప్రెస్ అక్కడి నుంచి బయల్దేరింది.
గతేడాది నవంబర్ లో పట్టాలు తప్పిన రైలు
రేణిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న CRS లో ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. తిరుపతి నుంచి రేణిగుంట వెళ్తున్న రైలుకి ఇచ్చిన సిగ్నల్ ను తనదిగా భావించిన లోకో పైలెట్ ఇంజిన్ ను ముందుకు కదిపారు. ఈ లోపు అసలు ట్రైన్ వస్తుండటంతో ట్రాక్ మార్చే ప్రయత్నంలో ఇంజిన్ పట్టాలు తప్పింది. పక్కనే బురదలోకి దిగిపోయింది రైలు ఇంజిన్. లోకో పైలెట్ సిగ్నల్ ను తప్పుగా అర్థం చేసుకోవటంతోనే ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో లోకో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. సంఘట స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఇంజన్ కు మరమ్మతులు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
రేణిగుంట తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్య గల CRS లో అర్ధరాత్రి రైల్వే ట్రాక్ నుంచి ట్రైన్ ఇంజన్ అదుపుతప్పింది. తిరుపతి నుండి రేణిగుంట రైల్వే స్టేషన్ కి వెళ్తున్న ఓ రైలుకు సిగ్నల్ ఇవ్వడంతో తమ రైలు ఇంజన్ కి సిగ్నల్ ఇచ్చారని లోకో పైలెట్ ముందుకు నడిపారు. దాంతో లూప్ లైన్ లో నిలిచి ఉన్న ఇంజన్ ముందుకు వెళ్లగా, ప్రక్కన ఉన్న లైన్లో సిగ్నల్ రావడంతో అసలు రైలు అదే ట్రాక్ లో రావడంతో లోకో పైలట్ ఆందోళన చెందాడు. తమ ట్రాక్ సిగ్నల్ అనుకొని పొరపాటున ట్రైన్ ను ముందుకి నడపటంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ ఇంజన్ అదుపుతప్పి రెండు అడుగుల మేర బురద లోకి దిగబడింది. లోకో పైలట్ సురక్షితంగా ఉన్నాడని సమాచారం.
ఈ ప్రమాదంతో రైల్వే ట్రాక్ విరగడంతో ట్రైన్ ఇంజన్ బురదలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని రైలు ఇంజన్ కు మరమ్మతులు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలకపోవడంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు
APPSC Group1 Mains: జూన్ 3 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
Nellore Tragedy: నెల్లూరులో విషాదం, పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు దుర్మరణం!
CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!