అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

Weather Latest Update: ఇంకో రెండ్రోజులు దంచికొట్టనున్న వర్షాలు! ఈ జిల్లాల్లో వారికి ఆరెంజ్ అలర్ట్ జారీ!

పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఆవరించిన ప్రభావంతో తేమ గాలులు వీస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ ఒడిశా వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలో వాతావరణ స్థితి
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. నేడు (మార్చి 17న) నిజామాబాద్‌, జగిత్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. 

రేపు కూడా వర్షాలు
రేపు (మార్చి 18న)ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


ఏపీలో వర్షాలు ఇలా
పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఆవరించిన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.

ఢిల్లీలోని భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం.. ఉత్తర భారతదేశంలోని వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ ఏడాది సమయానికి ముందే ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతల బలమైన ప్రభావం కనిపించింది. తాజాగా పాకిస్తాన్‌లో ఏర్పడిన తుపాను ప్రసరణ కారణంగా, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల వాతావరణంలో మార్పు వచ్చింది. దీంతో ఈ ప్రాంతాల్లో మార్చి నెలలోనే వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్
నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. కొండా సురేఖ సంచలన పోస్ట్
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్
నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. కొండా సురేఖ సంచలన పోస్ట్
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Death Hoax: ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Komalee Prasad: చీరలో కోమలీ... చూపులతో చంపేస్తోన్న చిన్నది
చీరలో కోమలీ... చూపులతో చంపేస్తోన్న చిన్నది
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Embed widget