Rain Alert: ఏపీలో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న సమయంలో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి.
![Rain Alert: ఏపీలో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం rain alert in andhrapradesh Rain Alert: ఏపీలో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/10/eb71501b0cce48fe9ac99a28aa94fc75_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ సమయంలో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రగొండపాలెం, ఉదయగిరి, కనిగిరి, తిరుపతి ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి.. ఈశాన్య రుతుపవనాలు వస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఇప్పటికే ఆలస్యమైంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్ , మజలి ప్రాంతాల గుండా వెళుతుంది. అక్టోబర్ 26, 2021న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందు వల్ల నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలు ఉన్నాయి.
Synoptic features of Weather Inference for Andhra Pradesh in Telugu Language Dated-24.10.2021. pic.twitter.com/fwySUbfdkl
— MC Amaravati (@AmaravatiMc) October 24, 2021
ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
కేరళలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీరు వచ్చి ఇళ్లలో చేరడంతో వారి బాధ వర్ణణాతీతంగా మారింది. వరదలకు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష బీభత్సం కొనసాగింది. ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంది.
Also Read: TDP Vs YSRCP: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం.. నేడు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం
Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)