By: ABP Desam | Updated at : 10 May 2022 03:40 PM (IST)
నారాయణను కొట్టడానికే అరెస్ట్ చేశారన్న రఘురామ
టెన్త్ పేపర్ల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణను ( TDP Leader Narayana ) అరెస్ట్ చేయడం న్యాయం అనుకుంటే సీఎం జగన్, విద్యా మంత్రి బొత్స సత్యనారాయణలను ( Botsa Satyanarayana ) కూడా అరెస్ట్ చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( Raghurama ) డిమాండ్ చేశారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజికి కారణమని సీఎం జగన్ ( CM Jagan ) అన్నారని, కానీ మంత్రి బొత్స సత్యనారాయణ అదంతా అబద్ధం అని చెప్పారని, ఇందులో ఏది నిజం, ఏది నమ్మాలి? అని రఘురామ ప్రశ్నించారు. ఢిల్లీలో రఘురామ మీడియాతో మాట్లాడారు.
నారాయణ అరెస్టు పూర్తిగా కక్ష పూరితం, బొత్స ఆ ప్రకటన చేయలేదా? చంద్రబాబు ఆగ్రహం
కొట్టడం కోసమే నారాయణను ( Arrest For Attack ) అరెస్ట్ చేశారని రఘురామ ఆరోపించారు. విచారణ చేపట్టే గదుల్లో కెమెరాలు తీసేస్తారని, వ్యక్తిగత సిబ్బందిని కూడా పంపించేస్తారని రఘురామ వెల్లడించారు. కొట్టడం కోసమే ఆ విధంగా చేస్తారని, ఆ తర్వాత పచ్చి అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. ఇవన్నీ తన కేసులోనూ జరిగాయని, దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నానని పేర్కొన్నారు. నారాయణ ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలియదు కానీ, రెండు మూడు దెబ్బలు కొడితే ఏమైనా జరగొచ్చని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణను అభిమానించేవారు వెంటనే కోర్టును ( Court ) ఆశ్రయించడం మంచిదని సూచించారు. ఈ ప్రభుత్వ పెద్దలు ఎంతవరకైనా తెగించే రకం అని రఘురామ స్పష్టం చేశారు.
తప్పు చేస్తే ఎవర్నీ వదిలేది లేదు, అందుకే అరెస్ట్ చేశారు - నారాయణ అరెస్టుపై మంత్రి బొత్స
ప్రభుత్వ అన్యాయాల్ని నిలదీయడానికి ప్రజలు క్రమంగా బయటికొస్తున్నారని, ఓ సీనియర్ నేతను అరెస్ట్ చేస్తే వాళ్లందరూ భయపడతారని ఈ అరెస్ట్ చేసినట్లుగా రఘురామ విశ్లేషించారు. రఘురామకృష్ణరాజును గతంలో ఆయన పుట్టిన రోజు నాడు సీఐడీ అధికారులు రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆయనపై భౌతిక దాడికి దిగారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సికింద్రాబాద్ ఆస్పత్రిలో రిపోర్టులు కూడా వచ్చాయి. ప్రస్తుతానికి ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. గతంలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాంను కూడా అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు భౌతిక దాడి చేశారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.
ఏ-1 చంద్రబాబు, ఏ-2 నారాయణ - మళ్లీ రాజధాని భూముల కేసుల్లో సీఐడీ అరెస్టులు !
CM Jagan Davos Tour : దావోస్ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ క్లాజ్ ష్వాప్తో భేటీ
Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Chandrababu : ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్లిళ్లు, పేరంటాలకు తిరుగుతున్నా అరెస్టు చేయడంలేదు, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్కు జట్టు ఎంపిక
Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?