అన్వేషించండి

Soma Sekhar Reddy: 'బలమైన ప్రతిపక్ష నేతను ఢీకొనాలంటే బలమైన వ్యక్తి కావాలి' - పుట్టపర్తి వైసీపీ సీనియర్ నేత సోమశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ysrcp Leader Soma Sekhar Reddy: బలమైన ప్రతిపక్ష నేతను ఢీకొనాలంటే బలమైన వ్యక్తి కావాలని పుట్టపర్తి వైసీపీ సీనియర్ నేత సోమశేఖర్ రెడ్డి అన్నారు. ఏబీపీ దేశం ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Ysrcp Leader Soma Sekhar Reddy Comments: రాబోయే ఎన్నికల్లో తనకు అధిష్టానం పుట్టపర్తి టికెట్ కేటాయిస్తే తప్పుకుండా గెలుచుకుని వస్తానని పుట్టపర్తి (Puttaparthi) నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేత సోమశేఖర్ రెడ్డి (Soma Sekhar Reddy) అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రతిపక్ష నేతను ఢీకొట్టాలంటే ఇవతల కూడా బలమైన నేత ఉండాలని ఆయన ఏబీపీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Q) పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి మీరు ఏం చర్చించారు.? 

A) ముఖ్యమంత్రి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు పుట్టపర్తి ఎయిర్ పోర్టులో ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ.. నేను పార్టీలో చాలా సీనియర్ నాయకుడిని.. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను 2014 ఎన్నికల్లో కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోయాను. ప్రస్తుతం ప్రజల్లోనే తిరుగుతున్నాను పుట్టపర్తిలోనే నివాసం ఉంటున్నాను. ఈసారి పుట్టపర్తి టికెట్ నాకు కేటాయిస్తే తప్పకుండా గెలుచుకొని వస్తాను. 2019 ఎన్నికల్లో మీరు చెప్పినట్లే శ్రీధర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటే నేను తప్పుకున్నాను. 2019 ఎన్నికల్లో ఆయనకు సపోర్ట్ చేశాను. ప్రస్తుతం బలమైన ప్రతిపక్ష నేతను ఢీకొట్టాలంటే ఇవతల వైపు కూడా బలమైన వ్యక్తి ఉండాలని.. నేను బలమైన వ్యక్తిని నాకు టికెట్ కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుచుకొని విజయవాడకు రా మాట్లాడుదాం అని సీఎం చెప్పారు. 

Q) సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్ కేటాయిస్తారనుకుంటున్నారా ? 

A) సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి నేను ఏమీ మాట్లాడను. అది జగన్ ఇష్టం. గత ఎన్నికల్లో నా టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు నా టికెట్ నేను అడగడంలో తప్పులేదు కదా. పుట్టపర్తి నియోజకవర్గంలో అసమ్మతి నేతలు పెరుగుతూ వస్తున్నారు. నేనైతే వారందరినీ కలుపుకొని నిలబడి గెలుచుకొని వస్తాను. గత ఎన్నికల్లో నేను శ్రీధర్ రెడ్డికి సపోర్ట్ చేశాను. ఈ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నా. అదే జగన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాను. 

Q) ప్రస్తుతం మీరు విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రితో ఏమైనా చర్చలు జరిపారా ?

A) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ నెల 27 లేదా 28న నాకు పిలుపు రావచ్చు. 

Q) విజయవాడ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా శ్రీధర్ రెడ్డి టికెట్ కేటాయిస్తున్నాను.. శ్రీధర్ రెడ్డికి మీరు సపోర్ట్ చేయమంటే చేస్తారా ? 

A) 99% టికెట్ నాకే వస్తుంది వేరే వాళ్లకు రాదు. వేరే వాళ్ల గురించి మాట్లాడే అవసరం లేదు. 2014 ఎన్నికల్లో కూడా వేరే వాళ్లకి టికెట్ అని చెప్పి నాకు కేటాయించారు ఇప్పుడు కూడా జగన్ టికెట్ కేటాయిస్తారు నేను గెలిచే గుర్రాన్ని. 

Q) రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. షర్మిల ప్రభావం వైసీపీపై ఏ విధంగా ఉంటుందనుకుంటున్నారు.?

A)  2014 ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 2000 ఓట్లు వచ్చాయి.. మహా అయితే ఇంకొక 1000 పెరుగుతాయి అంతే తప్ప పెద్దగా ఏమీ జరగదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరోగా ఉంది. పార్టీలో గెలవాలంటే పల్లెల్లో కార్యకర్తలు ఉండాలి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీకే రాష్ట్రంలో క్యాడర్ ఉంది. ఎప్పటికైనా కార్యకర్తలను చూసుకుంటే వారే పార్టీని గెలిపిస్తారు.

Also Read: YS Sharmila: 'ఏదో ఆశించి నేను పాదయాత్ర చేయలేదు' - వైఎస్సార్ పాలనకు, జగనన్న గారి పాలనకు పొంతన లేదన్న షర్మిల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget