అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP BJP : ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ - నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసిన పురందేశ్వరి !

ఏపీ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్మలా సీతారామన్‌కు పురందేశ్వరి లేఖ రాశారు. అప్పులు, అవినీతి లెక్కలు తేల్చాలని కోరారు.


AP BJP :   రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకల నిర్వహణ పైన, కార్పోరేషన్ల రుణాలపైన, ఆస్తుల తనఖ పెట్టి తెచ్చిన అప్పులు మరియు ఇతర సావరీన్ గ్యారంటీలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి  పైన ఫోరన్సిక్ ఆడిట్ జరిపించాలని ,  రాష్ట్ర ఆర్థిక స్థితి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని కోరుతూ  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు లేఖ ఇచ్చారు విజయవాడ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ ను పురందేశ్వరి కలిశారు. ఈ సందర్భంగా కీలక అంశాలతో కూడిన లేఖను ఇచ్చారు.  

ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అంచన కోసం ఫోరన్సిక్ ఆడిట్ జరిపించాలని , శ్వేత పత్రం విడుదల చేయాలని పురందేశ్వరి .. నిర్మలా సీతారామన్ ను కోరారు.  రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ల పైన, ముఖ్యంగా బెవరేజ్ కార్పోరేషన్ వంటి సంస్థల పైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారగా దర్యాప్తు చేయించాలన్నారు.  రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మోత్తం రాష్ట్ర అప్పుల పైన అడిగిన ప్రశ్నకు  జవాబుగా కేవలం ఆర్బీఐ కు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహ చేసిన ఇతర అప్పులను చెప్పలేదన్నారు.  పార్లమెంట్ లో ఇచ్చిన ఈ సమాధానంను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో తమ స్వంత కుటుంబ మీడియా ద్వారా ,  లక్షలాది వాలంటీర్ల ద్వార బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం  ప్రచారం చేస్తున్నదన్నారు.  రాష్ట్ర భవిష్యత్తు,  ప్రజా క్షేమం కోసం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని తిప్పలు నుండి బయట వేయలనే రాష్ట్ర బిజేపి ప్రయత్నలను తప్పుగా చిత్రీకరించారని లేఖ ద్వారా నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. 

నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిల్ 
 
 రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు వినియోగించుకున్న కాంట్రాక్టర్లకు, సేవలకు, సప్లయర్లకు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల పైన చెల్లించాల్సిన బాధ్యతకు సంభంధించి కోర్టుల నుండి ఆదేశాలున్నా కూడా గత నాలుగు సంవత్సరాలుగా చెల్లింపులు చేయలేని దయనీయ స్థితిలోకి రాష్ట్రాన్ని తెచ్చారు.  రాష్ట్రంలో మున్సిపల్ పన్ను లేదా బిల్లు, ఆస్థి పన్ను , విద్యుత్ బిల్లులు, రాష్ట్ర పన్నులు ఆలస్యంగా కడితే 18% అదనంగా వసూళ్లు చేస్తున్నప్పుడు, ప్రభుత్వం సకాలంలో చెల్లించని బకాయలకు ఎందుకు అదే శాతం వడ్డి కట్టరు అని రాష్ట్రంలోని వర్తక వాణిజ్య సంఘాలు ప్రశ్నిస్తూన్నాయ్, ఏవరైన ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన చెల్లింపులు సకాలంలో చెయ్యకపోవడం వల్ల పెద్ద ఎత్తున బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోయి ఏన్పీఏ లు పెరిగిపోతున్నాయి అనే విషయం గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.  

ఏటా రూ. లక్ష కోట్లకుపైగా అప్పులు 

ప్రస్తుతం సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత ఆదాయం 90 వేల కోట్లు, కేంద్ర పన్నులలో వాట  35 వేల కోట్లు, మొత్తం ఆదాయం దాదాపు 1 లక్ష 35 వేల కోట్ల రూపాయలు. అలాగే బడ్జెట్ ప్రకారం రాష్ట్రం వ్యయం 2.60 లక్షల కోట్ల రూపాయలు, అంటే మిగిలిన 1.25 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఏఫ్ఆర్బీఏం పరిధిలో ఆర్బీఐ నుండి అప్పులు మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ల అప్పుల ద్వార పక్కకు మల్లించిన నిధులు ద్వార సమకూర్చుకోవడం జరుగుతున్నదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ స్వంత ఆదాయం కేవలం 90 వేల కోట్ల రూపాయల మాత్రమే అయినప్పుడు ఎలా ప్రతి సంవత్సరం అంతకు మించి అప్పులు  అప్పులు చేయగలుగుతుందని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడ్జెట్ మరియు అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉందన్నారు. 

ఇప్పటికే ఏపీ అప్పు 11 లక్షల కోట్లు 

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం నెత్తిన ఉన్న   అప్పు 11 లక్షల కోట్ల రూపాయలు అయితే, సగటున ఏడాదికి 8% వడ్డీ అనుకున్నా కూడా వడ్డీ మాత్రమే  88 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ అప్పు రాబోయే 30 సంవత్సరాల్లో తీర్చాలన్నా సంవత్సరానికి కనీసం 36 వేల కోట్లు అవసరమన్నారు.  కాంట్రాక్టర్లకు మరియు సప్లైయర్లకు  చెల్లించాల్సిన మోత్తం సకాలంలో చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ లో తక్కువ ప్రతి సంవత్సరం 1.24 లక్షల కోట్ల రూపాయలను అసలు అప్పు మరియు వడ్డీ క్రింద కట్టాల్సి ఉంటుందన్నారు.  ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ అసాధ్యమని స్పష్టం చేశారు. 

ఏపీ బేవరెజెస్ కార్పొరేషన్ పై విచారణ

ఏపీ బెవరేజ్ కార్పోరేషన్ ద్వార ప్రతి రోజు ఒక కోటి మంది సగటున 200 రూపాయల చొప్పున నాణ్యత లేని చీప్ లిక్కర్ త్రాగడం ద్వార ఆర్థికంగా కుటుంబాలు చితికిపోవడమే కాక వారి ఆరోగ్యం కూడా గుల్ల అవుతుందని నిర్మలా సీతారామన్ దృష్టికి పురందేశ్వరి తీసుకెల్లారు.  దీనితో పాటు, మద్యం ద్వార  సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లెక్కలోకి రాకుండ పక్కకు మల్లిస్తూన్నారు. దాదాపు అన్ని మద్యం ఉత్పత్తి కంపెనీలు మరియు సప్లై రాష్ట్రంలోని పాలక పక్షం అస్మదీయుల చేతుల్లో ఉన్నాయి. నిజాన్ని నిగ్గు తేల్చడం కోసం రాష్ట్రంలోని అన్ని డిస్టీలరీల పైన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారా ావిచారణ అవసరమన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget