Pulivendula News : వివేకా డ్రైవర్ దస్తగిరి ఆరోపణలు అవాస్తవం, పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నాం : పులివెందుల డీఎస్పీ
Pulivendula News : వివేకా హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన దస్తగిరి తనకు భద్రత కల్పించడంలేదని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు స్పందించారు.
![Pulivendula News : వివేకా డ్రైవర్ దస్తగిరి ఆరోపణలు అవాస్తవం, పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నాం : పులివెందుల డీఎస్పీ Pulivendula DSP says Viveka driver dastagiri allegations not true Pulivendula News : వివేకా డ్రైవర్ దస్తగిరి ఆరోపణలు అవాస్తవం, పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నాం : పులివెందుల డీఎస్పీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/23/4c545347c7018eaa0827173cd549b54c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pulivendula News : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన దస్తగిరి చేసిన ఆరోపణలపై పోలీసులు స్పందించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించలేదని చేసిన ఆరోపణల అవాస్తమని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. దస్తగిరి వ్యక్తిగత పనుల మీద ఎక్కడికి వెళ్లినా 1+1 భద్రత కల్పిస్తున్నామన్నారు. దస్తగిరి ఇంటి వద్ద 1+3 సాయుధ పోలీసులు కాపలాగా ఉన్నారని తెలిపారు. ప్రతి రోజూ ఒక హెడ్ కానిస్టేబుల్, సీఐ స్థాయి అధికారి రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు. దస్తగిరి వద్ద డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వివరాలు ప్రతిరోజూ నమోదు చేస్తున్నామని వెల్లడించారు. దస్తగిరి చేస్తున్న ఆరోపణలు అవాస్తవని డీఎస్పీ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు దస్తగిరికి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.
దస్తగిరి చేసిన ఆరోపణలు
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో తనకు రక్షణ కరువైందని, పోలీసులు భద్రత కల్పించడంలేదని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి డ్రైవర్ దస్తగిరి ఆరోపిస్తున్నారు. పులివెందులలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన కోర్టుకు చెప్పినట్లు జిల్లా పోలీసులు తనకు రక్షణ కల్పించడం లేదని ఆక్షేపించారు. పోలీసులు సరైన రక్షణ కల్పించడంలేదన్నారు. పులివెందుల దాటి వెళ్తే తన వెంట సెక్యూరిటీ ఎవరూ రావడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లు తనతో ఉండటం లేదన్నారు. ప్రతిసారీ సీబీఐ అధికారులకు ఫోన్ చేసి సెక్యూరిటీని పంపమని కోరడం ఇబ్బందిగా ఉందన్నారు. తన ప్రాణానికి హాని జరిగితే తిరిగి తీసుకుని వస్తారా అని దస్తగిరి ప్రశ్నించారు. స్థానిక పోలీసులతో తన కదలికలు తెలుసుకుంటున్నారు తప్ప రక్షణగా ఉండడంలేదని ఆరోపించారు.
ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో డైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. తనకు భద్రత కోసం ఇద్దరు పోలీసులను కేటాయించామని జిల్లా పోలీసులు చెబుతున్నా వారెవ్వరూ తన ఇంటి వద్ద ఉండడం లేదని దస్తగిరి ఆవేదన చెందారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పాలంటే కష్టంగా ఉందని పేర్కొన్నారు. పులివెందులలో ఎక్కడికి వెళ్లాలన్నా భయంగా ఉందన్నారు. సెక్యూరిటీగా పోలీసులు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వైలెన్స్ పేరు చెప్పి భద్రత కల్పించకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన ప్రాణాలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దస్తగిరి ప్రశ్నించారు.
Also Read : Anantapur News : అనంతపురంలో దారుణం, బాలుడి మూతిపై వాత పెట్టి అంగన్వాడీ ఆయా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)