అన్వేషించండి

Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ

Polavaram Project Dispute | పోలవరంపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌లో లోపాలున్నాయంటూ సుప్రీంకోర్టు విచారణను తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వానికి తక్షణ నోటీసులు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌లో లోపాలున్నాయంటూ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వానికి తక్షణ నోటీసులు, ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, గోదావరి నీటి వినియోగం, పోలవరం-బనకచర్ల అనుసంధానం వంటి అత్యంత కీలకమైన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ వివాదాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, ప్రాజెక్టుల లింకేజీలపై నెలకొన్న వివాదాలు కొనసాగుతున్న సమయంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ అభ్యర్థన తిరస్కరణ - పిటిషన్‌లో లోపాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే ఏపీ ప్రభుత్వానికి తక్షణమే నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. తెలంగాణ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ఈ సందర్భంగా ఎత్తిచూపింది. ఆ లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.

నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
పిటిషన్‌లో లోపాలు ఉన్నందున, దానిపై ప్రాథమిక విచారణ జరపకుండా ఎదుటి పక్షానికి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి) ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ కొనసాగాలంటే మొదట పిటిషన్‌లోని లోపాలను సరిచేయాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులకు సూచించింది. లోపాలు సవరించిన తర్వాతే ఈ కేసు తదుపరి ప్రక్రియ ముందుకు సాగనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget