అన్వేషించండి

AP Train Accident: ఏపీలో రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియా

PM Modi ex-gratia for Train Accident victims: ఏపీలో రైలు ప్రమాదంపై నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల మేర నష్టపరిహారం ప్రకటించారు.

PM Modi announced ex-gratia Rs2 lakh

విజయనగరం: ఏపీలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం అలమండ- కంటకాపల్లి వద్ద రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ కనీసం ఏడుగురు చనిపోగా, మరో 50 మంది వరకు గాయపడ్డారని సమాచారం. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల మేర నష్టపరిహారం ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి సైతం రూ.50 వేలు చికిత్స కోసం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు.

రైలు ప్రమాదం గురించి తెలియగానే ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రమాదం వివరాలపై కేంద్ర మంత్రిని ఆరా తీశారని పీఎంఓ తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బాధితులకు సాధ్యమైనంత మేరకు సహాయ సహకారాలు అధికారులు అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు, రైలు ప్రమాదం దుర్ఘటనపై కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్‌.. ఏపీ సీఎం జగన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టంతో పాటు బాధితులకు వైద్య చికిత్స లాంటి వివరాలను రైల్వే మంత్రి వైష్ణవ్‌ ఆరా తీసినట్లు సమాచారం.

రైలు ప్రమాదం మృతుల్లో ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించనున్నారు. 

రైలు ప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ స్ నాగలక్ష్మి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
- బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు
- బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సూచించారు.

రాయగడ ఎస్ ప్రెస్ రైల్ ప్రమాదం ఘటనపై విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే
0891 2746330, 08912744619
ఎయిర్ టెల్
81060 53051
8106053052
బీఎస్ ఎన్ ఎల్ 
8500041670
8500041671

విశాఖలో హెల్ప్ లైన్ నెంబర్లు ఇవీ.. 
విశాఖపట్టణం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి, చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ రైలు ప్రమాదం ఘటనలో బాధితుల వైద్య సహాయార్థం విశాఖపట్టణం K.G.H.లో హెల్ప్ లైన్ నంబర్స్ ను జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున ఏర్పాటు చేశారు. 
విశాఖ కేజీహెచ్ లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే..
1. కేజీహెచ్ casuality No.8912558494
2. Doctor at కేజీహెచ్ మొబైల్ No. 8341483151 (24 hrs available)
3. Doctor at కేజీహెచ్ casuality మొబైల్ No.8688321986 (24 hrs available)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?

వీడియోలు

Suryakumar Yadav Batting Ind vs SA Series | బ్యాటర్‌గా విఫలమయ్యానన్న సూర్యకుమార్
India vs South Africa 5th T20 Highlights | సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
Embed widget