అన్వేషించండి

PM Matru Vandana Yojana: మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!

PM Matru Vandana Yojana: పీఎం మాతృ వందన యోజన స్కీమ్ కింద కేంద్రం గర్భిణీ మహిళలకు రెండు కాన్పులకు కలిగి రూ.11 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది.

PM Matru Vandana Yojana: ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం కింద గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. అర్హులైన మహిళలు మొదటి బిడ్డకు రూ. 5,000 వరకు మూడు వాయిదాలలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. రెండో సంతానం ఆడపిల్ల అయితే రూ. 6,000 జమ చేస్తుంది. అలాగే గర్భిణీలకు, పాలిచ్చే  తల్లులకు పోషకాహారం అందిస్తుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలలో మహిళలు కూలీ పనికి వెళ్తుంటారు. గర్భధారణ సమయం కూలి పనికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ లోటును భర్తీ చేసేందుకు మహిళలకు మెరుగైన ఆహారం, వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మాతృ వందన యోజన కింద ఆర్థిక సాయం, పోషకాహారం అందిస్తుంది. 

మూడు వాయిదాల్లో

పీఎం మాతృ వందన యోజన స్కీమ్ కింద మహిళలకు నేరుగా రూ. 11,000 వరకు జమ చేస్తుంది. విడతల వారీగా ఈ సాయం అందుతుంది. మొదటి బిడ్డ పుట్టినప్పుడు రూ. 5000 ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో జమ చేస్తారు. మొదటి వాయిదాను గర్భధారణ నమోదు చేసినప్పుడు, రెండో వాయిదా ఆరోగ్య పరీక్ష పూర్తి చేసిన తర్వాత, మూడో వాయిదా బిడ్డ జనన ధృవీకరణ పత్రం, టీకా రికార్డులు సమర్పించిన నేరుగా తల్లి ఖాతాలో డబ్బు జమ చేస్తారు.   

రెండో సంతానం ఆడపిల్ల అయితే అదనంగా రూ. 6000 ఆర్థిక సహాయం అందిస్తుంది. రూ. 6000 మొత్తం ఒకే వాయిదాలో బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సాయం చేస్తుంది కేంద్రం.  ఈ విధంగా మొత్తం రూ. 11,000 ఆర్థిక సాయం చేయనున్నారు.  

PMMVYకి ఎవరు అర్హులు?

  • మహిళ వయస్సు కనీసం 19 సంవత్సరాలు నిండి ఉండాలి. 
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించకూడదు
  • మొదటి రెండు కాన్పులకు మాత్రమే వర్తిస్తుంది 
  • బిడ్డ పుట్టిన 270 రోజులలోపు దరఖాస్తు చేయాలి. 
  • అన్ని వర్గాల మహిళలు అర్హతలు  

దరఖాస్తు విధానం  

  • పీఎం మాతృ వందన పథకం కింద ప్రయోజనం పొందడానికి మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • అధికారిక వెబ్‌సైట్ pmmvy.wcd.gov.in ద్వారా అప్లికేషన్ ఫారమ్ నింపవచ్చు. 
  • అవసరమైన డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. 
  • గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డు, గర్భధారణకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు అప్లోడ్ చేయాలి. 
  •  లేదా సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రం లేదా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించవచ్చు.

 

 

Frequently Asked Questions

ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ఎవరికి ఆర్థిక సహాయం అందిస్తుంది?

ఈ పథకం గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మొదటి బిడ్డకు రూ. 5,000 వరకు, రెండో సంతానం ఆడపిల్ల అయితే అదనంగా రూ. 6,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.

PMMVY పథకం కింద ఆర్థిక సహాయం ఎలా అందజేస్తారు?

ఆర్థిక సహాయం మూడు వాయిదాలలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. గర్భధారణ నమోదు, ఆరోగ్య పరీక్షలు, మరియు బిడ్డ జనన ధృవీకరణ పత్రాలు సమర్పించిన తర్వాత ఈ వాయిదాలు అందజేస్తారు.

PMMVY పథకానికి ఎవరు అర్హులు?

కనీసం 19 సంవత్సరాలు నిండిన మహిళలు, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు మించనివారు, మొదటి రెండు కాన్పులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

PMMVY పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హులైన మహిళలు అధికారిక వెబ్‌సైట్ pmmvy.wcd.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రం/ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget