Pawan Satire On Jagan : సీఎం జగన్‌కు భారతరత్న అంతటి అవార్డు- పవన్ కల్యాణ్ సెటైరిక్ ట్వీట్!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. అప్పురత్న అవార్డు వచ్చినట్లుగా ఓ కార్టూన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
Pawan Satire On Jagan : వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే ఆర్బీఐ నుంచి రూ. 55, 555 కోట్ల అప్పు తెచ్చిందని లెక్కలు విడుదల అయ్యాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. సీఎం జగన్ పై సెటైర్ వేశారు. ఆయనకు అప్పు రత్న అవార్డు వచ్చినట్లుగా అధికారులు ఆయనకు ఓ మెమెంటోను తెచ్చి ఇస్తున్నట్లుగా కర్టూన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. పక్కనున్న మరో అధికారి అది భారతరత్న లాంటి గౌప్ప అవార్డు అని చెబుతూండటం మరింత సెటైరిక్‌గా ఉంది. ఈ కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కార్టూన్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ వ్యక్తిగత ఆస్తులను పెంచుకునే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అదే సమయంలో రాష్ట్ర, ప్రజల ఆస్తులను కుక్కలకు వదిలేయాలని .. కానీ వ్యక్తిగత ఆస్తులను భద్రంగా చూసుకుంటారన్నారు. అదే అది సీఎం స్పిరిట్ అని.. సెటైర్ వేసారు.
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2023
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊#AppuRatnaAPCM pic.twitter.com/bnZEOHdMFa
జనసేనానికి చాలా కాలంగా.. సీఎం జగన్ పై ఈ తరహా సెటైర్లు కార్టూన్ల రూపంలో వేస్తున్నారు. ఓ కేబినెట్ మీటింగ్‌లో ఎన్నికలు వస్తున్నందున మంత్రులందరూ అవినీతికి దూరంగా ఉండాలని జగన్ సూచించినట్లుగా వార్తలు వచ్చాయి.దానిపై కార్టూన్ పోస్ చేసి.. అవినీతికి క్రాప్ హాలీడ్ ప్రకటించడం సంతోషమని సెటైర్ వేసారు.
వైసిపి వారు తాము చేస్తున్న అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయం .. https://t.co/3eRk0D0dFh
— Pawan Kalyan (@PawanKalyan) December 15, 2022
పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించేది తక్కువే. ఎక్కువ సందర్భాల్లో పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తారు. కీలకమైన అంశాలపై విమర్శలు చేయాలంటే ..తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఏ అప్ డేట్ ఇచ్చినప్పటికీ.. సంచలనంగా మారుతూ ఉంటుంది. వైరల్ అవుతుంది. ఇలాంటి సెటైరిక్ కౌంటర్లు ఇచ్చినప్పుడు జనసైనికులు మరింతగా ఉత్సాహంగా వాటిని వైరల్ చేస్తూ ఉంటారు.
ఏపీ ప్రభుత్వ అప్పుల వ్యవహారం ప్రతీ సారి హైలెట్ అవుతూనే ఉంటుంది. పూర్తిగా అప్పుల వివరాలు ఆర్బీఐకికూడా చెప్పడంలేదని.. ఆర్బీఐ దగ్గర తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాల గురించి మాత్రమే... బయట పెడుతూంటారని చెబుతూంటారు. ఇటీవలి కాలంలో ఉద్యోగులకు పూర్తి స్తాయిలో జీతాలు కూడా సమయానికి అందడంలేదు. అప్పులు దొరకకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ అప్పులపై వేసిన సెటైర్లు నెటిజన్లను మరింత గా ఆకట్టుకుంటున్నాయి.