అన్వేషించండి

Pawan Kalyan: ఎన్డీయే నుంచి జనసేన ఔట్? - ఎట్టకేలకు స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan kalyan: ఎన్డీయేకు పవన్ కళ్యాణ్ కటీఫ్ చెప్పనున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ వార్తలపై ఇవాళ పవన్ కళ్యాణ్ స్పందించారు.

Pawan Kalyan: మొత్తం 175 సీట్లు వైసీపీకే వస్తాయని ఆ పార్టీలు నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు జనసేనకు భయపడాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం సీట్లు మీకు వస్తే టీడీపీ, జనసేనకు భయపడనక్కర్లేదు కదా? అని ప్రశ్నించారు. ఎన్డీయే కూటమిలో మేము ఉంటే ఏంటి..? లేకపోతే మీకు ఏంటి? అని వైసీపీ నేతలను నిలదీశారు. జనసేనకు 170 ఎమ్మెల్యే సీట్లు, 30 ఎంపీ సీట్లు ఉంటే ప్రతిపక్షాల ఊసే ఎత్తనని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ భవిష్యత్తు తేలుస్తానని అన్నారు. తనపై దాడి చేయడానికి వైసీపీ శ్రేణులు కార్యాలయం చుట్టూ మోహరించారని. ఆ సమయంలోనే తాను పారిపోకుండా ఆఫీసులోనే కూర్చున్నట్లు పవన్ స్పష్టం చేశారు.

నాలుగో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలోని ముదినేపల్లిలో పవన్ కళ్యాణ్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. జనసేన అధికారంలోకి రాగానే పెంచిన మద్యం ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం చేస్తామనే అబద్దపు మాటలు తాను చెప్పనన్నారు.  వైసీపీ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తుందని, తాము గెలిచిన తర్వాత మీరు నిలబడి ఉంటారా? లేదా? చూడండి అని హెచ్చరించారు. ధైర్యం ఉంటే తాము గెలిచాక మీరు మీ కార్యాలయాల్లోనే ఉండండి అని సవాల్ విసిరారు. కైకలూరులో జనసైనికులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కైకలూరులో ఒక వంతెన కూడా నిర్మించలేకపోయారని, వంతెనకు 80 శాతం ఖర్చు చేసినా ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. రోడ్లు వేయలేని ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు. ఒక వంతెన కట్టలేక 45 గ్రామాలను ఇబ్బంది పెడుతున్నారని, కైకలూరు ఎమ్మెల్యే, ఆయన కుమారుడికి కొమ్ములు విరగ్గొడతామని పవన్ హెచ్చరించారు.

ఐదేళ్లు అధికారంలో ఉంటేనే ఇక్కడి ఎమ్మెల్యే, ఆయన కుమారుడికి కొమ్ములు వచ్చాయని, వారి కొమ్ములను విరిచి కింద కూర్చోబెడతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం మారిన రోజున కొల్లేరు మొత్తం తిప్పిస్తామన్నారు. ఓ ఎమ్మెల్యే.. వైఎస్‌కే ఎదురునిలిచినవాడిని.. నువ్వెంత..? నీ బతుకెంత? అంటూ కైకలూరు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అద్బుతంగా పాలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలని, భయపడుతున్నారంటే తమకు బలం ఉందని ఒప్పుకున్నట్లేనని అన్నారు. ఏపీలో వైసీపీ జెండా తప్ప వేరేది ఉండకూడదా? ఏపీలో ఫ్యాక్షనిజం చేయాలనుకుంటున్నారా? అని పవన్ ప్రశ్నించారు. 

జనసేన క్యాడర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారని, ఎవరిపై ఏ కేసులు పెట్టారో అన్ని గుర్తు ఉన్నాయని  పవన్ వ్యాఖ్యానించారు.. వారసత్వ రాజకీయాల పల్ల తనకు ఇబ్బందేమీ లేదని, వైఎస్సార్‌ను ఎదురించి కూడా తాను ఎక్కడికీ పోలేదని అన్నారు.  సీఎం జగన్ అంచెలంచెలుగా ప్రజల జీవితాలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. పవన్ బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. కృష్ణా జిల్లాలో చివరి రోజు యాత్ర కావడంతో జనాలు పోటెత్తారు. అంతుకుముందు పవన్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసైనికులు భారీగా పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో సంచలనం- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో సంచలనం- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో సంచలనం- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో సంచలనం- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget