అన్వేషించండి

Pawan Kalyan on Volunteers : వలంటీర్లపై మరోసారి జనసేనాని ఫిర్యాదు - ఈ సారి ఏ అంశంలో అంటే ?

పవన్ కల్యాణ్ మరోసారి వలంటీర్స్‌పై ఫిర్యాదు చేశారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రాంలో పాల్గొనడంపై ఆయన మండిపడ్డారు.


Pawan Kalyan on Volunteers :  ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల విధులు, వారి విషయంలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. మరో సారి పవన్ కల్యాణ్ వాలంటీర్ల తీరుపై ఆరోపణలు చేశారు. ఈ సారి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో వలంటీర్లు పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఏపీ అధికార పార్టీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. వాలంటీర్లను ఓటర్ వెరీఫికేషన్ లో భాగం చేశారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సీఈవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.  


కర్నూలులో బీఎల్‌వో సస్పెన్షన్ 

పవన్ కల్యాణ్ ట్వీట్‌లో  పేర్కొన్న పేపర్ కటింగ్‌లో ఉన్న బీఎల్‌వోను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. కర్నూలులో ఎక్కువగా వాలంటీర్ల జోక్యం ఉన్నట్లుగా ఫిర్యాదులు రావడంతో..  ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.సుజనా  సిబ్బందిని ఆదేశించారు.  కర్నూలు జిల్లాలో ఇంటింటికి ఓటర్ల సర్వే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన కర్నూల్ రెవెన్యూ డివిజన్ లోని వెల్దుర్తి మండల కేంద్రంలో బీఎల్ఓ పై సస్పెన్షన్ వేటు వేశారు.  వాలంటర్‌తో కలిసి బీఎల్ఓ ఇంటింటా సర్వేలో పాల్గొన్నారు. దీంతో కలెక్టర్ డాక్టర్ సుజనా సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయని సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వాలంటరీతో కలిసి సర్వే చేస్తే సస్పెన్షన్స్ ఉంటాయని  హెచ్చరించారు. 

ఇప్పటికే టీడీపీ ఫిర్యాదులతో కలెక్టర్లకు ఈసీ నోటీసలు 

 బీఎల్‌ఓలతో పాటు వెళుతున్న వాలెంటీర్‌ల ఫోటోలు తీసి ఎన్నికల కమిషన్ సీఈఓకు టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌.. వాలెంటీర్‌లు వెళ్లిన జిల్లాల నుంచి వెంటనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.  వాలెంటీర్‌లను ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో జోక్యం చేసుకోనివ్వకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమాలను బహిర్గతం కాకుండా బీఎల్‌ఓలకు చెప్పేందుకు వాలెంటీర్‌లను కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. బీఎల్‌ఓలతో వాలెంటీర్‌లు వస్తే వెంటనే ఫోటోలు తీసి పంపాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. వాలెంటీర్‌ను వెంటపెట్టుకొని వెళ్లిన ఒక బీఎల్‌ఓను కర్నూలు అధికారులు సస్పెండ్ చేశారు. తెలుగుదేశం ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని మరికొంతమంది బీఎల్‌ఓలు, వాలెంటీర్‌లపై చర్యలు తీసుకునేందుకు ఈసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా వాలెంటీర్‌ల జోక్యంపై ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget