అన్వేషించండి

Pawan Kalyan: వైరల్ అవుతున్న పవన్ తాజా ట్వీట్ - సెటైర్ వారికేనా - అందులో ఏముందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేసిన ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా రేపు (ఫిబ్రవరి 25వ తేదీన) విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే తెలంగాణలో ఈ సినిమాకు టిక్కెట్ ధరలకు పెంపు, అదనపు ఆటలకు అనుమతులు లభించాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నియమాలను కఠినతరం చేస్తూ అన్ని థియేటర్లకు నోటీసులు పంపించారు.

భీమ్లా నాయక్ సినిమాకు అదనపు ఆటలకు కానీ, టిక్కెట్ ధరల పెంపునకు కానీ అనుమతులు లేవని... జీవో నం.35  ప్రకారం రేట్లు అమలు చేయకపోతే థియేటర్లను సీజ్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదలకు కొన్ని గంటలకు ముందు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ప్రముఖ జర్మన్ వేదాంతి పాస్టర్ మార్టిన్ నిమొల్లర్ తెలిపిన మాటలను ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మొదట వారు సోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడు నేను మాట్లాడలేదు... నేను సోషలిస్టును కాదు కాబట్టి. ఆ తర్వాత వారు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు... ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్టును కాదు కాబట్టి. ఆ తర్వాత వారు యూదుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూదుడిని కాదు కాబట్టి. చిట్టచివరికి వారు నాకోసం వచ్చారు. అప్పుడు నాకోసం మాట్లాడటానికి ఎవరూ లేరు.’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇప్పుడు తనకు తలెత్తిన సమస్య తర్వాత మిగతావారికి కూడా వచ్చే అవకాశం ఉందని ఇన్‌డైరెక్టుగా చెప్పకనే చెప్పినట్లుంది. గతంలో సాయిధరం తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కల్యాణ్ ఇవే మాటలు చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇన్‌డైరెక్ట్‌గా ఏపీ ప్రభుత్వం తీరు మీద కూడా ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే విషయంపై మాట్లాడినందుకు నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకు కూడా ఏపీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. నియమాలను కఠినంగా అమలు చేసేలా స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ వేసిన ట్వీట్ నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget