![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan : పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వాన్ని కడిగేసిన పవన్ - సినిమా టిక్కెట్ల నాటి జీవో చూపించి ..
Andhra News : పెన్షన్ల ఇష్యూలో పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన సినిమా విడుదలయినప్పుడు రెవిన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేసి ఇప్పుడు వృద్ధుల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
![Pawan Kalyan : పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వాన్ని కడిగేసిన పవన్ - సినిమా టిక్కెట్ల నాటి జీవో చూపించి .. Pawan Kalyan lashed out at the government on pension Issues Pawan Kalyan : పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వాన్ని కడిగేసిన పవన్ - సినిమా టిక్కెట్ల నాటి జీవో చూపించి ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/03/e211e3ea59d39b4d2b3396681010496a1712143978762228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pawan Kalyan lashed out at the government on pension Issues : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్ పెట్టారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గతంలో జారీ చేసిన ఉత్తర్వులను చూపిస్తూ మరీ ఘాటుగా ప్రశ్నించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయన్నారు. పవన్ తన ట్వీట్‌లో పాత ఉత్తర్వులను జతచేశారు. ఈ ట్వట్ వైరల్ అవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?… pic.twitter.com/5VnX1BuWC4
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2024
వృద్ధులకు జనసైనికులు సాయం చేయాలని పవన్ పిలుపు
ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు సాయంగా ఉండాలని జనసైనికలకు పవన్ పిలుపులనిచ్చారు. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళాలని కోరారు. పింఛన్ ఇప్పించిన తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించగలరు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు.
నగదు జమ కాకపోవడంతో చాలా చోట్ల పంపిణి కాని పెన్షన్లు
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్లు చాలా చోట్ల వృద్ధులకు బుధవారం కూడా అందలేదు. రెండు విధాలుగా పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామ సచివాలయాల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. వేల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి నగదు తెచ్చుకునేందుకు వెళ్లినా ఖాతాల్లో నగదు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. జానికి ఈ ఒక్క రోజే కాకుండా.. మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. మంచాన పడిన వారికి, వితంతువులకు ఇంటి వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయంచారు. మిగిలిన వారికి సచివాలయాల దగ్గర పంపిణీ చేస్తారు అందరికీ ఇదే రోజు కాదు...మూడు రోజుల పాటు పంపిణ చేస్తారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యం కావడంతో వృద్ధులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే పెన్షన్లను పంపిణీ చేస్తామని ఎందుకు చెప్పారంటూ పెన్షన్‌దారులు మండిపడుతున్నారు. చివరకు పెన్షన్ పంపిణీ లేకపోవడంతో ప్రజలు వెనుతిరిగి వెళ్లిపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)