Pavan Kalyan : సవాంగ్‌ను అందుకే బదిలీ చేశారా ? జగన్ సర్కార్‌పై ప్రశ్నల బుల్లెట్లు వదిలిన పవన్ కల్యాణ్ !
గౌతం సవాంగ్‌ను బదిలీ చేయడానికి కారణాలు చెప్పాలని జగన్ సర్కార్‌ను పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. చెప్పకపోతే ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే డీజీపీని బదిలీ చేశారని భావించాల్సి వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతం సవాంగ్‌ను ( Goutam Sawang ) తప్పించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pavan Kalyan ) కూడా ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేశారు. గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ( AP DGP ) ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారని.. ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు కానీ వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు.
శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/YjGpkBDbiN
— JanaSena Party (@JanaSenaParty) February 15, 2022
ఇందుకు గల కారణాలను ప్రజలకు తెలియ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ ( Chalo vijayawada ) విజయవంతం అయినందుకే డీజీపీని బదిలీ చేశారని భావించాల్సి వస్తుందన్నారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ( AP Governament ) ఉందిని పవన్ కల్యాణఅ విమర్శించారు. ఈ బదిలీ తీరు చూస్తే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని ( LV Subramanyam ) ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.
డీజీపీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. ఉన్న పళంగా ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ( Kasireddy Rajendranadh Reddy ) నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది పోలీసు వర్గాలను సైతం షాక్‌కు గురి చేసింది. ఇక రాజకీయవర్గాలు కూడా అంతే స్పందిస్తున్నాయి. ఎందుకు సవాంగ్‌ను తప్పించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. శాంతిభద్రతల పరంగా ఇటీవల ఎలాంటి ఘోరమైన తప్పిదాలు జరగలేదు. పైగా ఉత్తమ డీజీపీగా ఇటీవలే గౌతం సవాంగ్‌కు ( Best DGP Sawang ) కూడా అవార్డు వచ్చింది. ఈ తరుణంలో ఆయనను తప్పించడంపై కారణాలేమిటన్నది అందరికీ పజిల్‌గా మారింది.