(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Meets Chandrababu : చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ - కీలక చర్చలు !
చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్, నాదెండ్ల వెళ్లారు. పరామర్శించడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
Pawan Meets Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పై విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్.. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో ఆయన వరుణ్ తేజ్ పెళ్లి కార్యక్రమంలో భాగంగా ఇటలీలో ఉన్నారు. ఇటలీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబును కలవాలనుకున్నారు. శనివారం రోజు ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకుని తిరిగి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్, నాదెండ్ల ఆయన ఇంటికి వెళ్లారు.
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే పొత్తును ప్రకటించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాతనే పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసే విషయాన్ని ప్రకటించారు. ఇలా పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవలేదు. మొదటి సారి ... ఇప్పుడు సమావేశం అవుతున్నందున పొత్తు అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన క్యాడర్ కింది స్థాయి వరకూ కలిసి పని చేసేలా కార్యాచరణ చేపట్టారు. సమన్వయ కమిటీ సమవేశాలు నిర్వహిస్తున్నరు. ఇవన్నీ పక్కాగా సాగితేపొత్తులు పెట్టుకున్న సమయంలో ఓట్ల బదిలీ సాఫీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ
మరో వైపు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి విరమించుకుంది. కానీ జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. జనసేన పార్టీ ప్రత్యేకంగా బీజేపీతో చర్చలు జరపలేదు తాము 32 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని జాబితా విడుదల చేశారు. తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి చర్చలు జరిపారు. కలిసి పోటీ చేసేలా అంగీకరింపచేశారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షాతోనూ సమవేశం అయ్యారు. అయితే ఇంకా సీట్లు ఫైనల్ కాలేదు. జనసేనకు పదకొండు సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధిాకరికంగా ఖరారు చేయలేదు.
కీఅమిత్ షాతో చర్చల గురించి ప్రస్తావించే అవకాశం
ఈ క్రమంలో తెలంగాణలో జనసేన రాజకీయం.. ఏపీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. బీజేపీతో ఏపీలో ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమిత్ షాతో భేటీలో పవన్ కల్యాణ్ ఏపీ అంశాలపై ఏమైనా మాట్లాడి ఉంటే వాటిపైనా.. ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.