అన్వేషించండి

Pawan Kalyan Kakinada: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై పవన్ కళ్యాణ్ 'మాట-మంతి'- పొల్యూషన్ ఆడిట్‌కు ఆదేశాలు -100 రోజుల్లో పరిష్కార హామీ

Pawan Uppada: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై పవన్ సమీక్ష చేశారు. వందరోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. పొల్యూషన్ ఆడిట్‌కు ఆదేశించారు.

Uppada fishermen problems Kakinada: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్  కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో 'మాట-మంతి' కార్యక్రమం నిర్వహించారు. సముద్ర కాలుష్యం, తీర కోత, మత్స్యకారుల ఇబ్బందులు వంటి కీలక సమస్యలపై విస్తృత చర్చ జరిగింది. వేటకు వెళ్లి మృతి చెందిన 18 మత్స్యకారుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్రకాలుష్యంపై  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. 100 రోజుల్లో సమస్యల పరిష్కారానికి  మత్స్యకారులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
  
కార్యక్రమంలో మత్స్యకారుల ప్రతినిధులు సముద్రంలో కలిసే పారిశ్రామిక వ్యర్థాల వల్ల చేపలు మరణిస్తున్నాయని, తమ జీవనోపాధి ప్రభావితమవుతోందని తెలిపారు. తీర కోత, మత్స్య సంబంధిత సహాయాలు, బీమా వ్యవస్థలలో లోపాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ మత్స్యకారుల ప్రతి సమస్యను శ్రద్ధగా విని, అధికారులతో నోట్ చేయించారు. "మీ సమస్యలు మా ప్రాధాన్యత. పరిశ్రమలు, మత్స్య శాఖ, పీసీబీ, ఎన్జీవోలు, మత్స్యకారులు అందరినీ భాగస్వాములను చేసి, 100 రోజుల్లో పరిష్కార మార్గాలు సూచిస్తాం" అని భరోసా ఇచ్చారు.  

 పీసీబీ అధికారులు పారిశ్రామిక కాలుష్యంపై వెంటనే ఆడిట్ చేపట్టి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.   వేటకు వెళ్లి మరణించిన 18 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షలు చెక్కులు పంపిణీ చేశారు.   

ఉప్పాడ తీరప్రాంతంలో పారిశ్రామిక ప్రదేశాల వల్ల సముద్ర నీటి కలుష్యం పెరిగింది. చేపలు మరణించడం, మత్స్యకారుల ఆదాయం తగ్గడం వంటి సమస్యలు గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా కాకినాడకు చేరుకుని, భారీ బందోబస్తు మధ్య సమావేశం జరిగింది. కలెక్టరేట్ సమావేశం ముగిసిన తర్వాత, మత్స్యకారులు, స్థానిక నాయకులతో మరిన్ని చర్చలు జరిగాయి.                                           

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget