Pathipati Joins YCP: వైసీపీలో చేరుతున్న ప్రత్తిపాటి అని ప్రచారం! అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారంటూ టీడీపీ స్ట్రాంగ్ రిప్లై
Pathipati Joins YCP: టీడీపీ పార్టీనీ వీడి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపరేశారు.
Pathipati Joins YCP: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికార పార్టీ వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. కన్‌ఫ్యూజ్ వార్తలతో ప్రజలను వైసీపీ నాయకులు డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావాలనే తప్పుడు ప్రచారం..
టీడీపీ నాయకులను వైసీపీ నేతలు, కార్యకర్తలు, మరో వైపు ఐప్యాక్ యూట్యూబ్ ఛానల్స్ టార్గెట్ చేస్తున్నారని.. సోషల్ మీడియాను ఉపయోగించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు హితవు పలికారు. రాజకీయాల్లో నైతిక విలువలకు వైసీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు తిలోదకాలు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.
ఓటమి భయంతో అసత్య ప్రచారం..
ಓటమి భయంతో ప్రతిపక్షాలపై యూట్యూబ్ ఛానల్స్ లో యథేచ్చగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీకి విధేయులుగా ఉన్న నాయకులను టార్గెట్ చేసి వారి విశ్వసనీయత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారనిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలకు టీడీపీ నాయకులు కౌంటర్ ఇస్తే డిలీట్ చేస్తున్నారని పత్తిపాటి పుల్లారావు తెలిపారు. తిమ్మపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఉంటే తాడేపల్లిలో ఉన్నట్లు యూట్యూబ్ ఛానల్స్ లో తప్పుడు ప్రచారం చేయించారని ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల ప్రతిఘటన చూసిన తర్వాత ಓటమి భయంతో వైసీపీ నాయకులు ఇలాంటి విష ప్రచారాలకు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేసినా.. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని ప్రత్తిపాటి ధీమా వ్యక్తం చేశారు.
గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన సెగలు..
గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. పల్నాడు జిల్లా రాజుపాలెం ఎస్సీ కాలనీలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించగా.. స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. మంత్రి అంబటిని స్థానిక మహిళలు నిలదీశారు. సంక్షేమ పథకాలు రావడం లేదని మంత్రిని వారు ప్రశ్నించారు. గెలిచిన మూడేళ్లకు గుర్తుకు వచ్చామా అని మంత్రిని పట్టుకుని ప్రశ్నించారు. గ్రామంలో సమస్యలు ఉన్నాయని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు రావడం లేదని, ధరలు పెరిగాయని మంత్రిని నిలదీశారు. మూడేళ్లు అయిననా పింఛను రావడం లేదని ఓ దివ్యాంగురాలు మంత్రిని అడిగారు. పక్కనే ఉన్న అధికారులు వాళ్ల ఇంట్లో నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్న కారణంగా పింఛన్ మంజూరు కావడం లేదని తెలిపారు. దీంతో మంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోతుండగా.. ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో చోట తమ సమస్యలు చెప్పిన మహిళలపై మంత్రి అంబటి అసహనం వ్యక్తం చేశారు. మహిళలు ఆగ్రహించడంపై మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అధికారులు.. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో పర్యటించారు. తేలిక పాటి వాన కురిస్తేనే వీధులన్నీ బురద గుంటల్లా మారుతున్నాయని.. సర్పంచి ఎంపీటీసీతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.