(Source: ECI/ABP News/ABP Majha)
Prakasam Barrage: 'ఆ బోట్లు వైసీపీ నేతలవే' - ప్రకాశం బ్యారేజీ ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారుల నివేదిక
Andhra News: ప్రకాశం బ్యారేజీలో బోట్లు ఢీకొన్న ఘటనపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉన్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.
Officers Reported To CM Chandrababu On Prakasam Barrage Issue: ఇటీవల ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని తెలిపారు. డ్యాంను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునే వారని చెప్పారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా వాటి యజమానులను గుర్తించినట్లు పేర్కొన్నారు. AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023, AP-IV-M-SB-0017 నెంబర్లున్న బోట్లతో పాటు ప్రకాశం బ్యారేజీని మరో రెండు బోట్లు ఢీకొన్నాయి.
వీరికి చెందినవే..
ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను ఉషాద్రి, కర్రి నరహింహా స్వామి, గూడూరు నాగమల్లీశ్వరిలకు చెందినవిగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన 3 బోట్లను కలిపి కట్టడం వెనుకు కుట్ర కోణం దాగి ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా మూడింటిని కలిపి కట్టరని.. వాటికి ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు పేర్కొన్నారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని నివేదికలో తెలిపారు. ఈ నెల 2న తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. అవి గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లకు కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా తాకితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని చెప్పారు. మరోవైపు, పోలీసులు నిందితుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రామ్మోహన్, ఉషాద్రిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది
ఈ నెల 2న ప్రకాశం బ్యారేజీకి 11.42 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరింది. అదే రోజున వేకువజామున 3 గంటల సమయంలో ఎగువ నుంచి పడవలు కొట్టుకొచ్చి.. 67,68, 69 గేట్లను ఢీకొట్టాయి. వీటిలో ఒకటి ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయింది. మరొకటి జాడ కనిపించలేదు. మిగిలిన వాటి వల్ల 2 గేట్లు దెబ్బతిన్నాయి. అయితే, దీనిపై కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం కావడంతో ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి 4 బోట్లు రావడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పారు.
దర్యాప్తులో కీలక విషయాలు?
అటు, ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. పడవల్ని కొద్దిరోజుల కిందటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారని.. అంతకు ముందు వరకూ అవి గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయునిపాలెం వైపు ఉండేవని తేలింది. అయితే, కొద్ది రోజుల కిందటే వీటిని ఎందుకు తెచ్చారు.. గొల్లపూడి రేవు దగ్గర ఉన్న శ్మశానం దగ్గర ఎందుకు కట్టి ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పడవల్ని వేటికవే నది ఒడ్డున లంగరు వేసి కట్టి ఉంచుతారు. కానీ, ఇక్కడ మాత్రం 3 పడవల్నీ కలిపి ప్లాస్టిక్ తాళ్లతో కట్టి ఉంచారు. కృష్ణా నదిలో నీటి మట్టం పెరుగుతున్న క్రమంలో.. ఏ పడవకు ఆ పడవను లంగరు వేసి కట్టి ఉంచాలని స్థానికులు హెచ్చరించినా యజమానులు పట్టించుకోలేదని పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని పోలీసులకు కొందరు వివరించినట్లు సమాచారం.
Also Read: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగింపు- ఘటనపై అధికారుల సందేహం