Krishna District: వెలుగు గ్రూపులో పోర్న్ వీడియోస్.. పొరపాటైందని అధికారి క్షమాపణలు.. సోషల్ మీడియాలో వైరల్
వెలుగు గ్రూపులో ఓ అభ్యంతర వీడియో పోస్టు అవ్వడం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొరపాటున పోస్టు అయ్యిందని సదరు అధికారి వివరణ ఇస్తూ క్షమాపణలు కూడా చెప్పారు.
స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన వెలుగు వాట్సాప్ గ్రూపులో నీలి వీడియో పోస్టు కలకలం రేపింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సమాచారాన్ని అందించేందుకు గ్రామ సమాఖ్యల పర్యవేక్షకుల ఏర్పాటు చేసిన ఓ గ్రూపులో అభ్యంతరకర పోస్టు అయింది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రూపులోని మహిళలు ఆ వీడియోపై అభ్యంతరం తెలిపారు. ఈ వీడియోను వెలుగు ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం పోస్టు చేయడంతో మరింత చర్చకు దారితీసింది.
తన నంబరు నుంచి వీడియో పోస్టు కావడంపై ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున ఆ గ్రూపులో పోస్టు చేసినట్లు చెప్పారు. ఈ విషయంలో తన తప్పు ఏంలేదన్నారు. అయినప్పటికీ కొందరు కావాలనే తనను అప్రతిష్ఠ పాలుచేసేందుకు వీడియోను ఇతరులకు పంపి రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో పోస్టు అయినందుకు గ్రూపు సభ్యులుకు నేరుగా క్షమాపణలు చెప్పానని బాలసుబ్రహ్మణ్యం అన్నారు.
Also Read: Bachpan Ka Pyaar : యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ర్యాపర్ బాద్ షా సాంగ్..
పొరపాటున పోస్టు అయ్యింది : వెలుగు అధికారి
స్వయం సహాయక సంఘాలకు సమాచారాన్ని అందించే గ్రామ సమాఖ్యల పర్యవేక్షకుల వాట్సాప్ గ్రూపులో బుధవారం రాత్రి పోస్టు అయిన ఓ వీడియోపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గ్రూపులో దాదాపుగా అందరూ మహిళలే ఉంటారు. తమ విధులకు సంబంధించిన సమాచారమని ఆ వీడియో చూశామన్నారు. కానీ అది నీలివీడియో అవ్వడంతో వారు షాకయ్యారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. పొరబాటున నీలి వీడియోను గ్రూపులో పంపినట్లు సదరు వెలుగు అధికారి సహచరులకు గ్రూపులో వెంటనే క్షమాపణ చెప్పారు. బుధవారం రాత్రి ఓ అత్యవసర సమాచారాన్ని గ్రామ సమాఖ్యలకు పంపుతున్నప్పుడు తనకు ఎవరో పంపిన వీడియో పొరబాటున వెలుగు గ్రూపులో పోస్టు అయ్యిందని ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ఘటనపై గ్రూపులోని మహిళలకు తాను నేరుగా క్షమాపణ సైతం చెప్పినట్లు తెలిపారు. కానీ ఈ అంశాన్ని కావాలని పెద్దది చేసి తనను అపఖ్యాతి చేసేలా కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వాపోయారు.
Also Read: Huzurabad Byelection late : ఎంత లేటయితే అంత ఎక్కువ ఖర్చు..! హుజూరాబాద్‌పై రాజకీయ పార్టీల్లో ఆందోళన !