NRI Yashasvi: ఎన్ఆర్ఐ యశస్వికి ఊరట - సీఐడీ లుక్ అవుట్ నోటీసులు రద్దు చేసిన హైకోర్టు
AP High Court: టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త యశస్వికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై సీఐడీ లుక్ అవుట్ నోటీసును రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
NRI Yashasvi Gets Relief in AP High Court: ఎన్ఆర్ఐ, తెనాలికి చెందిన బొద్దులూరి యశస్వికి (Yashasvi) ఏపీ హైకోర్టులో (AP HIgh Court) ఊరట లభించింది. తనపై ఏపీ సీఐడీ (CID) ఇచ్చిన లుక్ ఔట్ నోటీస్ ఎత్తేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ను ఇప్పటికే సీఐడీ అరెస్ట్ చేసి 41ఏ నోటీస్ ఇచ్చిందని ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చిన తర్వాత కూాడా లుక్ ఔట్ నోటీస్ కొనసాగించడం ఆర్టికల్ 21కి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నోటీస్ కారణంగా పిటిషనర్ కు విదేశాలకు వెళ్లాలంటే ఇబ్బందులుంటాయని, ఆ నోటీస్ కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం యశస్విపై సీఐడీ లుక్ ఔట్ నోటీస్ రద్దు చేస్తూ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ జరిగింది
కాగా, వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ (CM Jagan) కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు యశస్విపై ఏపీ సీఐడీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. అనంతరం 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విడుదల చేశారు. వృత్తి రీత్యా అమెరికాలో ఉంటున్న బొద్దులూరి యశస్వి (యష్) అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు 2023, డిసెంబర్ 23న హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆయన్ను చుట్టుముట్టారు. తమ వెంట రావాలని చెప్పగా, తన తల్లికి బాగాలేకపోతే చూసేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. ఆయన్ని అదుపులోకి తీసుకుని గుంటూరు (Guntur) సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత విచారణకు రావాలని నోటీసులిచ్చారు. ఈ క్రమంలో పాస్ పోర్టును సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై గతేడాది డిసెంబర్ 26న విచారించిన న్యాయస్థానం పాస్ పోర్ట్ తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా, లుక్ అవుట్ నోటీసులపైనా యశస్వికి ఊరట కల్పిస్తూ తీర్పు వెలువడింది.
Also Read: Crime News : ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్ - కర్నూలు ఎస్‌ఐ నిర్వాకం - అరెస్ట్ !