By: ABP Desam | Updated at : 13 Jul 2023 04:37 PM (IST)
ఏపీకి రూ. 2 లక్షల కోట్ల విలువైన రహదారులు - తిరుపతిలో నితిన్ గడ్కరీ ప్రకటన !
Nithin Gadkari : తిరుపతి జిల్లాలో 2900 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహింగసభలో ఆయన మాట్లాడారు. తిరుపతికి వచ్చే రోడ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాలని అన్నారు. 8744 కిలోమీటర్ల హైవేలు ఈ ఏడాది తిరుపతి జిల్లాలో నిర్మిస్తున్నామన్నారు. పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెంచడం ద్వారానే పేదరికం నిర్మూలించగలమని తెలిపారు. రోడ్లు, విద్యుత్తు పరిశ్రమ కావాల్సిన సౌకర్యాలు కల్పన తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పోర్టులు అభివృద్ధి చెందితే అభివృద్ధి వేగవంతంగా అవుతుందన్నారు.
తిరుపతిలో శ్రీ@nitin_gadkari గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 13, 2023
🛣️35 కి.మీ నాయుడుపేట-తుర్పు కనుపూర్ - ₹1,399కోట్లు
🛣️36 కి.మీ చిల్లకూరు క్రాస్-కృష్ణపట్నం పోర్ట్ సౌత్ గేట్ - ₹909 కోట్లు
🛣️ఈపూరు నుండి కృష్ణపట్నం పోర్ట్ వరకు 16కి.మీ డెడికేటెడ్ పోర్ట్ రోడ్డు - ₹610 కోట్లు.… pic.twitter.com/9N5SWwDX74
ప్రభుత్వం కోరడంలో రూ. 25వేల కోట్ల హైవేలు
రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో రూ.25 వేల కోట్లతో 1200 కిలోమీటర్లు హైవేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు లక్షల కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో హైవేలు నిర్మిస్తామన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ జీడీపీ దేశంలోని అత్యధికం కాబోతోందన్నారు. రోడ్లు మౌలిక సదుపాయాలు పెంపు వల్ల పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు మరింతగా రాబోతున్నాయని తెలిపారు. కడప రేణిగుంట హైవేను అక్టోబర్ 2024 పూర్తి చేస్తామన్నారు.
తిరుపతిలో అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్ మోడల్ బస్ స్టేషన్
మదనపల్లి హైవేను జనవరి 2025 పూర్తి చేస్తామని చెప్పారు. నెల్లూరు కృష్ణపట్నం పోర్టు హై వేను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. పీలేరులో జరుగుతున్న హైవే పనులను జనవరి 2025కి పూర్తి చేస్తామన్నారు. అలాగే ఏర్పేడు హైవే పనులను నవంబర్ 2024లోపు పూర్తి చేస్తామన్నారు. తిరుపతిలో ఇంటర్ మోడల్ బస్ స్టేషన్‌ను హైవే అథారిటీ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామని... ఆ పనులకు త్వరలో ఒప్పందాలు పూర్తి అవుతాయన్నారు. బెంగళూరు టు చెన్నై ఇప్పుడు ఆరు గంటలు పడుతోందని.. హైవే పూర్తి అయితే రెండు గంటల్లో ప్రయాణం పూర్తవుతుందన్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి ఢిల్లీ నుంచి హైవేని ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Gold-Silver Prices Today 07 December 2023: రెండు రోజుల్లో రూ.1400 తగ్గిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Tirumala Children Missing: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం, పీఎస్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Andhra News : ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు - ఓటర్ల జాబితా అవకతవకలపై పూర్తి స్థాయి పరిశీలన !
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
/body>