అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kodi Kathi Case: 'కేసును సాగదీసేందుకే సీఎం ప్రయత్నం, 20 కి.మీల దూరంలో ఉండి కూడా రాలేరా?'

Kodi Kathi Case: కోడి కత్తి కేసును సాగదీసేందుకు ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు రావడం లేదని కోర్టులో కౌంటర్లు దాఖలయ్యాయి. 

Kodi Kathi Case: కోడి కత్తికేసులో మరింత దర్యాప్తు అవసరమని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్ఐఏ కోర్టులో గురువారం కౌంటర్లు దాఖలు అయ్యాయి. ఎన్ఐఏ తరఫున, నిందితుడు శ్రీనివాస రావు తరఫున కౌంటర్లు దాఖలయ్యాయి. ఈ కౌంటర్లపై తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం కోడి కత్తి కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. 

కోడికత్తి కేసుపై జగన్ ఆసక్తి లేదు..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కోడి కత్తి కేసు విచారణపై ఆసక్తి లేదని, కోర్టుకు రాకుండా తప్పించుకునేందుకే మరింత సమయం కావాలని, మరింత దర్యాప్తు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారని నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది తన కౌంటర్ లో పేర్కొన్నారు. కోర్టుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే జగన్ ఉంటున్నా.. న్యాయస్థానానికి రావడానికి ఇష్టపడటం లేదని, చట్టంపై ఆయకు ఉన్న గౌరవాన్ని ఇది సూచిస్తుందని కౌంటర్ లో పేర్కొన్నారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసి, అభియోగపత్రం కూడా దాఖలు చేసిందని తెలిపారు. సాక్షుల విచారణ ప్రారంభమైందని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని కానీ, కేసును మరింత దర్యాప్తు చేయాలని గానీ కోర్టు దృష్టికి తీసుకురాలేదని గుర్తు చేశారు. మొదటి సాక్షి అయిన విశాఖపట్నం విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ విచారణ సందర్భంగా కూడా కొత్త విషయాలు బయటకు రాలేదని కౌంటర్ లో తెలిపారు. అలాంటప్పుడు ఇప్పటికే పూర్తి అయిపోయిన దర్యాప్తును పక్కన పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొత్త అంశాలు వెలుగులోనికి రానప్పుడు మరింత దర్యాప్తు చేయాలని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని తెలిపారు. ఇలాంటి అభ్యర్థన నేర విచారణ ప్రక్రియను అగౌరవ పరచడమేనని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మరింత దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి కొత్త సిద్ధాంతంతో అఫిడవిట్ దాఖలు చేశారని వెల్లడించారు. 

సీఎం జగన్ చట్టాన్ని గౌరవించాలి..!

సాక్షిగా కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తికి(సీఎం)కు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయని తెలిపారు. జగన్ చట్టాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. కానీ ఆయన దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సహేతుకం కాని కారణాలతో అఫిడవిట్ దాఖలు చేశారని అన్నారు. అలాగే ఈ అఫిడవిట్ లో విచారణలో బయటకు రాని కొత్త విషయాలను పేర్కొనలేదని తెలిపారు. నేరుగా సీఎం అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎన్ఐఏ ను బైపాస్ చేశారని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని పిటిషన్ లో అభ్యర్థించడం ద్వారా.. కోర్టులో విచారణ సాగడం ఇష్టం లేనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కోర్టు ముందు హాజరు కాకుండా తప్పించుకోవడానికే ఈ పిటిషన్ వేసినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే సీఎం ఉంటారని, అయినా ఆయన కోర్టుకు రావడానికి ఇష్టపడటం లేదని అన్నారు. ఇలాంటి చర్య చట్టంపై గౌరవాన్ని తగ్గించడమే అవుతుందని పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget