Voter List Modification: ఓటర్ జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు జారీ!
Voter List Modification: ఏపీలో ఓటర్ జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు జారీ అయినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆగస్టు 1 నుంచి మార్పులు అమల్లోకి రాబోతున్నట్లు తెలిపారు.
Voter List Modification: ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ జాబితా సవరణరకు నూతన మార్గ దర్శకాలు జారీ అయ్యాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నిల అధికారి ముఖేక్ కుమార్ మీనా తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫామ్ 6 అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అలాగే చిరునామాను మార్చుకోవాలి అనుకునే వారికి ఫామ్ 6 అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. జాబితా నుంచి పేరు తొలగింపునకు డెత్ సర్టిఫికెట్ తప్పని సరిగా కావాలని సూచిస్తున్నారు. అలాగే ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ కోసం ఫామ్ 6(బి) జత చేయాలని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు..
ఓటర్ జాబితా సవరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పక్బందీ ఏర్పాట్లు జుగుతున్నాయి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓటర్ జాబితా సవరణ, ఇతర ఎన్నికల సంబంధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు అమలు చేయనున్న ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. నిబంధనలు పాటిస్తూ.. షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చేపడతామని తెలియ జేశారు. బూత్ లెవెల్ అధికారులను ఇంటింటికీ పంపి ఓటర్ల వివరాల ధ్రువీకరణ, ఫార్మ్-6 బి దరఖాస్తు స్వీకరణ, ఆధార్-ఓటర్ కార్డు లింక్ చేయడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
క్షేత్రస్థాయిలో క్యాంపుల నిర్వహణ..
2023 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారికి ఓటర్ గుర్తింపు కార్డు అందించేందుకు క్షేత్ర స్థాయి క్యాంపులు నిర్వహిస్తామని కలెక్టర్లంతా ముక్తకంఠంతో చెప్పారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఓటర్ జాబితా సవరణ ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచుతామని చెప్పారు. గతంలో అక్కడక్కడా ఒకే చిరునామాలో పెద్ద సంఖ్యంలో ఓటర్లు ఉండటం వంటి సంఘటనలపై రాజకీయ పార్లీటు అభ్యంతరాలు వ్యక్తం చేశాయన్నారు. అటువంటి సమస్యలపై దృష్టి సారిస్తామని వివరించారు. ఇది వరకు ఓటర్ జాబితా తయారీలో ఎదురైన ఇబ్బందులు, రాజకీయ పార్టీల మేధావుల సూచనల మేరకు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని సవరణ కార్యక్రమాన్ని నిర్వహించోబతున్నట్లు వెల్లడించారు.
ఓటర్ జాబితా సవరణర కోసం కొత్తగా జారీ అయిన మార్గ దర్శకాలను... ప్రజల్లోకీ తీసుకెళ్తామని సూచించారు. క్షేత్ర స్థాయిలో అందరికీ ఓటర్ జాబితా సవరణ గురించి వివరిస్తామని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫామ్ 6 అందుబాటులోకి రానుందని అందరికీ అర్థం అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అలాగే చిరునామా మార్చుకోవాలి అనుకునే వారికి గతంలో లాగా ఫామ్ 6 అందుబాటులో ఉండదని చెప్తామన్నారు.