News
News
X

అమ్మాయి కోసం కొట్టుకున్న యువకులు- నెల్లూరు భ్రమరాంబ థియేటర్ వద్ద ఫైటింగ్ సీన్

ప్రియురాలు వెంటపడుతున్నారన్న అనుమానంతో హర్షవర్ధన్ అనే యువకుడి స్నేహితులను జయకృష్ణ అనే యువకుడు బెదిరించాడు. పట్టణంలోని భ్రమరాంబ సినిమా థియేటర్ వద్ద హర్షవర్ధన్, అరవ జయకృష్ణ మధ్య ఘర్షణ జరిగింది

FOLLOW US: 
Share:

ఇటీవల హైదరాబాద్‌లో లవర్ కోసం నవీన్ అనే స్నేహితుడిని హరిహరకృష్ణ అనే యువకుడు హత్య చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా అలాంటి ఘటనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగింది. కానీ ఇక్కడ హత్య జరగలేదు. కేవలం గొడవ జరిగింది, అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఓ అమ్మాయి ప్రేమ విషయంలో ఇద్దరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తన ప్రియురాలు వెంటపడుతున్నారన్న అనుమానంతో హర్షవర్ధన్ అనే యువకుడి స్నేహితులను అరవ జయకృష్ణ అనే మరో యువకుడు బెదిరించాడు. పట్టణంలోని భ్రమరాంబ సినిమా థియేటర్ వద్ద హర్షవర్ధన్, అరవ జయకృష్ణ మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానిక పోలీసుస్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

గతంలో వెంకటగిరి పట్టణంలో ఇలాంటి గొడవలు జరిగినా యువకులు ఎప్పుడు ఒకరిపై ఒకరు దాడికి దిగలేదు. గతంలో తన కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న ఓ యువకుడి బైక్ ని తండ్రి కాల్చివేసిన ఘటన వెంకటగిరిలోనే జరిగింది. అయితే ఆ వ్యవహారం తర్వాత తన ప్రేమకోసం ఆ యవకుడు పోలీసులకు కంప్లయింట్ కూడా ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు రెండు వర్గాలు కొట్టుకోవడంతో కలకలం రేగింది.

వెంకటగిరిలో ఇటీవల ఓ డాక్టర్ హత్య కేసు కూడా సంచలనంగా మారింది. ప్రొఫెషనల్ జలసీతో మరో డాక్టర్ అతడిని సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించాడు. తాజాగా ఇప్పుడీ గొడవ వెంకటగిరిలో కలకలం రేపింది. ఒక యువతికోసం ఇద్దరు యువకులు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఇంకొకరు దాడి చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సినిమా సీన్..

వెంకటగిరిలో రాత్రి జరిగిన ఘటన సినిమా సీన్ ని తలపించేలా ఉంది. ఇద్దరు యువకులు రోడ్డుపైకి రావడం, యాధృచ్ఛికంగా వారిద్దరూ తారసపడినట్టు మాట్లాడుకోవడం, వెంటనే యువతి విషయం ప్రస్తావనకు వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం సినిమా సీన్ లాగానే ఉంది. ఇద్దరు యువకులు దాడికి దిగడంతో వెంటనే వారి బ్యాచ్ లు కూడా రోడ్డుపైకి వచ్చాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అయితే రాత్రివేళ అందరూ చూస్తుండగానే యువకులు రెండు బ్యాచ్ లు గా విడిపోయి గొడవకు దిగడం సంచలనంగా మారింది.

పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కొందరు చెల్లాచెదరైపోయారు. వెంటనే గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రినుంచి వారు పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయికి మరో యువకుడు చూస్తున్నాడనే  అనుమానంతో ఈ గొడవ మొదలైంది. అయితే వారిది కేవలం అనుమానమేనా, ఇద్దరూ నిజంగానే ఒకే అమ్మాయిని ప్రేమించారా, అసలు ఆ అమ్మాయి ఈ ఇద్దరిలో ఒకరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Published at : 28 Feb 2023 02:47 PM (IST) Tags: Nellore Crime nellore abp venkatagiri news Nellore News

సంబంధిత కథనాలు

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

టాప్ స్టోరీస్

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?