అన్వేషించండి

కందుకూరు ఘటనలో హైడ్రామా- ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్, బెయిల్ పై విడుదల

కందుకూరు టీడీపీ ఇన్‌ చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ ను.. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.45గంటలకు కందుకూరుకి తీసుకొచ్చారు పోలీసులు.

కందుకూరు తొక్కిసలాట ఘటనలో 8మంది మృతి చెందిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీడీపీ లీడర్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కందుకూరు టీడీపీ ఇన్ చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైడ్రామా కొనసాగింది. అరెస్ట్ తర్వాత వారిద్దరినీ పోలీసులు రహస్యంగా విచారించారనే వాదనలు వినపడ్డాయి. అసలు వారిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటూ టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. దీంతో ఎట్టకేలకు హైడ్రామా నడుమ ఇంటూరి సోదరులకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు కందుకూరు పోలీసులు.

కందుకూరులో న్యాయమూర్తి పూర్ణిమాదేవి తెల్లవారుజామున 5.20 గంటలకు వారిద్దరికీ బెయిల్‌ మంజూరు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అయితే అరెస్ట్, బెయిల్ మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వారిద్దర్నీ హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు, కందకూరుకి తీసుకొచ్చారు. పోలీసులు మఫ్టీలో వెళ్లి, రెండు వాహనాల్లో వారిద్దర్నీ కందుకూరుకి తీసుకొచ్చారన తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు జిల్లాలో తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఎట్టకేలకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.

అరెస్ట్, బెయిల్.. మధ్యలో ఏం జరిగింది..?

కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ ను.. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.45గంటలకు కందుకూరుకి తీసుకొచ్చారు పోలీసులు. అయితే అప్పటికే టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి నాయకులను స్టేషన్ కి తరలించారు.

ఇంటూరి నాగేశ్వరరావు, రాజేష్ ను పోలీసులు స్టేషన్ లోకి తరలించే క్రమంలో స్థానిక బార్‌ అసోసియేషన్‌ నాయకులు, టీడీపీకి చెందిన కొంతమంది న్యాయవాదులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్టేషన్‌ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. న్యాయవాదులు, దామచర్లతోపాటు ఇతర టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ దశలో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాజరికంలో ఉన్నామా అంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.


కందుకూరు ఘటనలో హైడ్రామా- ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్, బెయిల్ పై విడుదల

టీడీపీ నాయకులు రాత్రి రెండున్నర గంటల సమయంలో హైకోర్టు న్యాయవాదులను బెయిల్ కోసం కందుకూరుకి పంపించింది. వారు పోలీసులతో చర్చించిన తర్వాత లోపలికి వెళ్లారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత 2.55 గంటలకు వైద్య పరీక్షల కోసం నాగేశ్వరరావు, రాజేష్ ను పోలీసులు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. 3.25 గంటల తర్వాత స్థానిక న్యాయమూర్తి పూర్ణిమా దేవి వద్దకు తీసుకువెళ్లారు. 5 గంటల వరకు వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి నివాసం బయట ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఆమె బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు హర్షం  వ్యక్తం చేస్తూ అక్కడినుంచి ఇంటూరి సోదరులతో కలసి వారి నివాసానికి బయలుదేరాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
Embed widget