By: ABP Desam | Updated at : 04 Aug 2022 07:39 AM (IST)
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
Sullurupeta ACB Raids: ఏసీబీ అధికారులు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో హడావిడి పడ్డాడు మున్సిపల్ కమిషనర్. తన దగ్గర ఉన్న డబ్బుల కట్టల్ని కిటికీనుంచి బయటపడేశారు. మొక్కల్లో సంచి పడిపోయింది కదా తనను పట్టించుకోరని అనుకున్నారాయన. కానీ చివరకు ఏసీబీ ఆ సంచిని స్వాధీనం చేసుకుంది. సంచిలో ఉన్న 1.13 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కమిషనర్ కారులోని డ్యాష్ బోర్డ్ లో మరో 50 వేల రూపాయలు బయటపడింది. ఆయన బీరువాలో మరో 30 వేల రూపాయలు కూడా దొరికాయి. మొత్తం లక్షా 93 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్త సాధారణ తనిఖీల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కానీ పక్కా సమాచారంతోనే వారు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లారని తెలుస్తోంది. పంచాయతీ సెక్రటరీగా ఉంటూ ప్రమోషన్ మీద మున్సిపల్ కమిషనర్ అయ్యారు నాగిశెట్టి నరేంద్రకుమార్. గతంలో ఆయన వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. ఆ తర్వాత సూళ్లూరుపేట బదిలీపై వచ్చారు.
బుధవారం ఉదయాన్నే ఏసీపీ అధికారులు సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్ మోహన్ ఆధ్వర్యంలో టీమ్ సూళ్లూరుపేట చేరుకుంది. మున్సిపల్ ఉద్యోగులను లోపల ఉంచి తలుపులు వేసి సోదాలు మొదలు పెట్టారు. కమిషనర్ నాగిశెట్టి నరేంద్రకుమార్ ఛాంబర్ లో పక్కనే కిటికీ ఉంది. ఏసీ ఉంటుంది కాబట్టి సహజంగా ఆ కిటికీ మూసేస్తారు. కానీ అధికారులు ఎంట్రీ ఇచ్చే సమయానికి కిటికీ తెరిచి ఉంది. దీంతో వారికి అనుమానం వచ్చింది. బయట కిటికీ దగ్గరకు వెళ్లి చూసే సరికి సంచిలో రూ.1.13 లక్షల నగదు ఉంది. దీంతోపాటు మరికొంత నగదుని కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ బృందం సోదాలు చేసింది. అప్పటి వరకూ బయటకు అధికారిక సమాచారం రాలేదు. ఆ తర్వాత అధికారికంగా ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని తెలిపారు ఏసీబీ సిబ్బంది.
సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 110 ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, 50 ఇళ్ల నిర్మాణాలు అనుమతులకు విరుద్ధంగా జరిగాయని గుర్తించారు అధికారులు. కమిషనర్ నరేంద్రకుమార్ సాధారణ పనిదినాల్లో రోజూ రాత్రి 8 గంటలకు వరకు ఆఫీస్ లోనే ఉంటారని, సెలవు రోజుల్లోనూ కష్టపడి పడనిచేస్తుంటారని సిబ్బంది చెబుతున్నారు. సెలవు రోజుల్లో కూడా ఇంత కష్టపడి పనిచేయడంపై స్థానికులకు అనుమానం వచ్చింది. నలుగురు వ్యక్తులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం బయటపడింది. ఈరోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
మెగస్టార్ బర్త్‌డే రోజున జనసేన కీలక భేటీ- కేడర్‌కు ఏం చెప్పబోతున్నారు?
లేఖ రాయడం కూడా లోకేష్‌కు చేతకాదు: కాకాణి
ఎట్టకేలకు కుదిరిన మహూర్తం-ఈనెల 30న నెల్లూరుకు జగన్
AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం
Nellore Police: సైబర్ నేరాలు బారిన పడకుండా ఉండాలంటే ఇవి పాటించండి - నెల్లూరు పోలీసులు
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా