అన్వేషించండి

నెల్లూరులో మెకానిక్‌ కాలాన్ని వెనక్కి తిప్పేస్తున్నారు!

గడియారం ముల్లు క్లాక్ వైజ్ గానే ఎందుకు తిరగాలి, వెనక్కి తిరిగితే తప్పేంటి. ఇలా ఆలోచించేవారిని ఎవరైనా వింతగా చూస్తారు. కానీ నెల్లూరులో ఓ వ్యక్తి ముల్లు వెనక్కి తిరిగేలా గడియారం తయారు చేశాడు.

గడియారం ముల్లు క్లాక్ వైజ్ గానే ఎందుకు తిరగాలి, వెనక్కి తిరిగితే తప్పేంటి. ఇలా ఆలోచించేవారిని ఎవరైనా వింతగా చూస్తారు. కానీ గడియారం ముల్లు వెనక్కి తిరగడం అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉన్నా.. అక్కడక్కడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటారు కొంతమంది. అలాంటి అరుదైన వ్యక్తి నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి చెందిన భాషా. పదిహేనేళ్లుగా ఆత్మకూరులో వాచ్ షాప్ నిర్వహిస్తున్న ఈయన రివర్స్ క్లాక్ తయారు చేశాడు.

గోడ గడియారం కానీ, వాచ్ కానీ తిరగడానికి మెకానిజం అవసరం. కీ ఇస్తే తిరిగే వాచీలు, బ్యాటరీ సహాయంతో తిరిగే గడియారాలు.. ఇలా వీటిలో అన్ని రకాలు ఉంటాయి. అయితే వీటిలో మెకానిజం మాత్రం ఒకటే. వాల్ క్లాక్ మూమెంట్ లో సెకన్ల ముల్లు, నిమిషాల ముల్లు, గంటల ముల్లు తిరిగేందుకు వేర్వేరుగా చక్రాలు ఉంటాయి. వాటిని ఒక్కొక్కటీ వేరు చేస్తూ పోతే లోపల సర్క్యూట్ బోర్డ్ ఉంటుంది. ఆ బోర్డ్ లో ఉన్న ఎర్త్ ప్లేట్ ని రివర్స్ చేసి పెడితే ముల్లు రివర్స్ లో తిరుగుతుంది.


నెల్లూరులో మెకానిక్‌ కాలాన్ని వెనక్కి తిప్పేస్తున్నారు!

ముల్లు రివర్స్ లో తిరిగినా గడియారం మాత్రం సరైన సమయం చూపించాలంటే ఆ గడియారంలో కూడా మనం మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. గడియారంలో పైన 12 తర్వాత 1, 2, 3 అంకెలు కుడివైపుగా ఉంటాయి. రివర్స్ క్లాక్ లో ఈ అంకెలన్నీ తారుమారైపోతాయి. 12కి ఎడమవైపున 1 వస్తుంది. ఆ తర్వాత రెండు వస్తుంది. ఇలా అంకెలు తారుమారు చేసి గడియారంలో కొత్త అంకెలతో కూడిన షీట్ ని అతికించుకోవాలి. ఇక ఈ షీట్ కి ఎర్త్ ప్లేట్ రివర్స్ చేసిన వాల్ క్లాక్ మూమెంట్ ని బిగిస్తే అది రివర్స్ గడియారం అయిపోతుంది.

రివర్స్ గడియారాలకు క్రేజ్ కూడా బాగానే ఉంటుంది. వీటికోసం కొన్ని ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్ ప్రత్యేకంగా సేల్స్ పెడుతున్నాయి. అయితే చాలా చోట్ల స్టాక్ ఉండదు. అతి తక్కువగా మాత్రమే వీటిని అమ్మకాలకు పెడుతుంటారు. నేరుగా షాపుల్లో వీటిని కొనుగోలు చేయాలంటే మాత్రం కాస్త కష్టమే. చాలా చోట్ల పెద్దపెద్ద వాచ్ షాపుల్లో కూడా రివర్స్ క్లాక్ అంటే తమకు తెలియదనే చెబుతారు. అయితే చిన్న టెక్నిక్ తో మన వద్ద ఉన్న గోడగడియారాలను ఇలా రివర్స్ లో తిరిగేలా చేయొచ్చు.

రివర్స్ క్లాక్ ని ఇంటిలో ఉపయోగించాలంటే కాస్త కష్టమే. దీన్ని ఉపయోగించడం అలవాటయ్యే వరకు వెంటనే టైమ్ అడిగితే చెప్పలేం. అలవాటు అయితే మాత్రం మామూలు గడియారాల్ల టైమ్ చూడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. రివర్స్ క్లాక్ ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఎందుకంటే గడియారంలో అంకెలన్నీ తారుమారై ఉంటాయి. అందులోనూ గడియారం వెనక్కు తిరుగుతుంది. ఒక్కసారిగా ఇలాంటి గడియారాన్ని చూస్తే తమ కళ్లను తామే నమ్మలేరు చాలామంది. ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఇలాంటి రివర్స్ గడియారాలను ఇళ్లలో పెట్టుకుంటారు. ఆ ఇంటికి వచ్చినవారందరికీ అనుకోని సర్ ప్రైజ్ ఇస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
KTR In Lagcherla Attack: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
KTR In Lagcherla Attack: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Pushpa 2: 'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Embed widget