By: ABP Desam | Updated at : 21 Jan 2022 11:23 AM (IST)
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి
నెల్లూరు జిల్లాలో కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకీ భారీగా పెరుగుతోంది. వెయ్యి మార్కుని క్రాస్ చేసింది. దాదాపు అన్ని డివిజన్లలో చాపకింద నీరులా కరోనా చుట్టేస్తోంది. ఈనెల 15న నెల్లూరు జిల్లాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 397, 16వతేదీన కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 253కు చేరింది. 17వ తేదీన కేసులు 261, 18వ తేదీ కొత్తగా నమోదైన కేసులు 246 ఉండగా.. ఆ సంఖ్య 19వ తేదీన 698 కాగా, 20వ తేదీన ఏకంగా 1012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ గణాంకాలు చాలు జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,372కు చేరుకోగా, కోలుకున్న వారి సంఖ్య 1,46,306కు చేరింది. జిల్లా వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4003కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 114 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
మరణాల సంఖ్య ఆందోళనకరం..
గతంలో నెలల తరబడి కరోనా కేసుల సంఖ్య 10 లేదా 20 లోపే ఉంది. అప్పుడు ఒక్క మరణం కూడా నమోదయ్యేది కాదు. అయితే ఇటీవల కాలంలో కరోనా మరణాల సంఖ్య జిల్లా అధికారులను కలవరపెడుతోంది. గత మూడు రోజులుగా ప్రతి రోజూ జిల్లాలో కరోనా కారణంగా కనీసం ఒక్కరు మరణిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటీ రెండు జిల్లాల్లోనే కరోనా మరణాలుంటున్నాయి. అందులో నెల్లూరు జిల్లా ఒకటి కావడం విచారకరం.
మరణాలకు కారణం ఏంటి..?
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ నేపథ్యంలో థర్డ్ వేవ్ వచ్చేసిందని అంటున్నారు. దానికి అనుగుణంగానే కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇన్ పేషెంట్ల సంఖ్య పెరగకపోవడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. నెల్లూరు జిల్లాలో వెయ్యికి పైగా కొత్తగా కేసులు నమోదైనా కేవలం 114మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంటే ఇన్ పేషెంట్లు కేవలం 10శాతం మంది మాత్రమే ఉంటున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో వరుసగా మూడు రోజులపాటు రోజుకొకరు కరోనాతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మరణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యాధుల వల్లే..
గత మూడు రోజులుగా కరోనాతో మరణించినవారి ఆరోగ్య పరిస్థితి గమనిస్తే.. వారంతా మధుమేహంతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు తేలింది. నెల్లూరు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మరణించిన వీరి మెడికల్ ట్రాక్ రికార్డ్ ని అధికారులు గమనించారు. కరోనాతోపాటు వారికి ఇతర వ్యాధుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని, అందుకే కోలుకోలేకపోయారని వివరిస్తున్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లతో పోల్చి చూస్తే థర్డ్ వేవ్ లో పెద్దగా ముప్పు లేదని తేలినా.. జిల్లాలో మరణాలు మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఆ మరణాలకు కరోనా ఒక్కటే కారణం కాదని తేలడం మాత్రం కాస్త ఊరటనిచ్చే అంశం.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Sri Talpa Giri: దక్షిణ శ్రీరంగం తల్పగిరి రంగనాథ మందిరం- ఈ గుడిలో అదే జరిగితే కలియగం అంతమైనట్టేనటా!
Pregnant Lady Marathon Walk: ఆత్మాభిమానంతో గర్భిణి సాహసం- భర్తపై కోపంతో 65 కిలోమీటర్లు నడిచి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Nellore Anil Warning : అమ్మలక్కలు తిట్టిస్తా - టీడీపీ నేతలకు మాజీ మంత్రి అనిల్ హెచ్చరిక !
Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయమ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్కు క్లియరెన్స్!
AP IPS Transfers : ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు - సుప్రీంకోర్టు చెప్పినా ఏబీవీకి మాత్రం నో పోస్టింగ్ !
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్కు మస్కా కొట్టాడుగా!