News
News
వీడియోలు ఆటలు
X

Chicken Biryani Offer: ఒక్క రూపాయికే చికెన్ బిర్యానీ - కాయిన్ తో వెళ్తే మాత్రం కాదండోయ్

Chicken Biryani Offer: ఒక్క రూపాయికే ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ దొరుకుతుందంటే పరుగులు పెడ్తుంటారు భోజన ప్రియులు. 

FOLLOW US: 
Share:

Chicken Biryani Offer: బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు భోజన ప్రియుల నోట్లో నీళ్లూరుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ చికెన్ బిర్యానీ, కశ్మీరి బిర్యానీ అంటే తినడానికి సిద్ధమైపోతుంటారు. వారంలో కనీసం మూడు, నాలుగు రోజులైనా బిర్యానీ తినకుండా ఉండలేరు కొందరు. ఘుమఘుమలాడే బిర్యానీ దొరుకుతుందంటే ఎంత దూరం అయినా వెళ్తుంటారు. అందులోనూ ఆఫర్ ఉందంటే ఇక అక్కడే కూర్చొని కడుపునిండా తిని.. పార్సల్ కూడా పట్టుకొని వస్తుంటారు. ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కేవలం ఒక్క రూపాయికే చికెన్ బిర్యానీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆ హోటల్ కు చేరుకున్నారు. కానీ రూపాయి నాణేలకు బదులుగా నోటు ఇస్తేనే...అని తెలియడంతో చాలా మంది వెనుదిరిగారు. 

అసలేం జరిగిందంటే..?

ప్రకాశం జిల్లా మార్కాపురంలో కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు. రూపాయికే బిర్యానీ ఇస్తున్న విషయం తెలుకున్న మరికొంత మంది నాణేలు పట్టుకొని రాగా.. నోటు ఇస్తేనే బిర్యానీ అని నిర్వాహకులు చెప్పారు. దీంతో పలువురు ఇళ్లకు వెళ్లిపోయారు. రూపాయి నోటు పట్టుకొని కూడా చాలా మందే హోటల్ కు రాగా... హోటల్ ఆవరణ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఇప్పటికే మూడు వందల మంది వరకు వచ్చారని.. ఇంకా మూడు వందల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా చికన్ బిర్యానీ అందిస్తామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. మీ దగ్గర కూడా నోట్ ఉంటే వెంటనే వెళ్లండి. రుచికరమైన బిర్యానీని రూపాయికే సొంతం చేసుకోండి. 

గతేడాది డిసెంబర్ లో 5 పైసలకే బిర్యానీ

బిర్యానీ పేరు చెబితేనే మన నోరూరుతుంది. బిర్యానీ నచ్చని భోజన ప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి బిర్యానీని కేవలం ఐదంటే ఐదు పైసలకు అందిస్తే ఇంకేం ఎగబడి తింటారు. ఇలాగే ఓ హోటల్‌ ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్‌ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్‌ కిటకిటలాడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడ, ఇంత తక్కువ ధరకు ఎందుకిస్తున్నారు వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ వాచ్ దిస్ ఐదు పైసలకే బిర్యాని స్టోరీ..!

చిత్తూరు జిల్లా పలమనేరులో మధు ఫ్యామిలీ డాబాను కొత్తగా ప్రారంభించారు. ఈ ఫ్యామిలీ డాబా యాజమాన్యం 5 పైసలకే బిర్యానీ అందిస్తున్నట్లు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే అని చెప్పడంతో డాబాకు జనం క్యూ కట్టారు. దీంతో పాటు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ లో వచ్చిన కస్టమర్లకు 50% రాయితీ ఇస్తామని మరో ఆఫర్ కూడా ఇచ్చింది రెస్టారెంట్ యాజమాన్యం. ఇక ఇదే బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ తో.. మూడు రోజుల పాటు 25 శాతం రాయితీ అందిస్తున్నారు నిర్వాహకులు. దీంతో హోటల్ వద్ద ఐదు పైసల కాయిన్ తో క్యూ కడుతున్నారు నగర వాసులు. ఒక్కసారిగా చిన్నాపెద్దా అందరూ ఎగబడడంతో ఆ హోటల్‌ తాకిడిని తట్టుకోలేకపోయింది. అంత మంది తరలి రావడంతో యాజమాన్యానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. వందలాది మంది తరలి రావడంతో ప్రస్తుతం రెస్టారెంట్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.

Published at : 06 Apr 2023 07:42 PM (IST) Tags: AP News Biryani Markapuram Offer one rupee note

సంబంధిత కథనాలు

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!