X

నెల్లూరులో వర్షం తగ్గినా వదలని వరద.. హైవేలపై నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం

సోమశిలనుంచి పెన్నాకు భారీగా నీటిని వదిలిపెట్టడంతో పెన్నమ్మ ఊళ్లను చుట్టేసింది. మొత్తం 9 మండలాల పరిధిలోని 40 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

FOLLOW US: 

సోమశిలనుంచి పెన్నాకు భారీగా నీటిని వదిలిపెట్టడంతో పెన్నమ్మ ఊళ్లను చుట్టేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ముంపు గ్రామాల వాసుల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తం 9 మండలాల పరిధిలోని 40 గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ముంపు ప్రాంతాల వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

నెల్లూరు రూరల్ మండలం, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల.. మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు ముంపు ముప్పు ఎక్కువగా ఉన్నట్టు హెచ్చరించారు అధికారులు. 

వర్షం తగ్గినా వదలని వరద.. 
మరోవైపు నెల్లూరు జిల్లాలో వర్షం దాదాపుగా తగ్గిపోయింది. అక్కడక్కడ చిరుజల్లులు మినహా ఈరోజు ఉదయం నుంచి వర్షం పెద్దగా లేదు. అయిదే వరద ముంపు మాత్రం రాత్రి నుంచి ఎక్కువైంది. ఉదయం నిద్ర లేచి చూసే సరికి చాలా ఊళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. రాత్రే అధికారులు ముంపు ప్రాంతాల వాసుల్ని తరలించాలని చూసినా.. కొంతమంది పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు ఇష్టపడటంలేదు. ఊళ్లలోకి నీరు వచ్చిన తర్వాత వారంతా ఉరుకులు పరుగులు పెడుతూ మోకాలి లోతు నీళ్లలో ఇళ్లలోనుంచి బయటపడ్డారు. 

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఎక్కడికక్కడ రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తహశీల్దార్ లు, వీఆర్వోలు, స్థానికంగా అందుబాటులో ఉండాలని చెప్పారు. అటు సచివాలయం సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చారు. 

నెల్లూరు - చెన్నై, నెల్లూరు-ముంబై హైవే లపైకి వరదనీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరంతో ఇతర ప్రాంతాలకు రవాణా ఆగిపోయింది. 

నగరంలోనూ వరద ప్రభావం.. 
నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. రంగనాథస్వామి ఆలయం సమీపంలోని కాలువ నుంచి నీరు దిగువకు వదిలారు. దీంతో సర్వేపల్లి కాల్వకు నీరు పోటెత్తింది. వెంకటేశ్వరపురం, అహ్మద్‌ నగర్‌, జనార్దన్‌ రెడ్డి కాలనీ, భగత్‌ సింగ్‌ కాలనీ, బోడిగాడితోట, రంగనాయకులపేట, పొర్లుకట్ట, అరవపాళెం ప్రాంతాల్లో వరదనీరు వచ్చి చేరింది. ముంపు ప్రాంతాల వారందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వీరికోసం నెల్లూరు నగరంలో 8 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నదీ పరీవాహకం ముంపు గుప్పిట్లో ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వందలాది మంది కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ఇక శనివారం ఉదయం నుంచి వరద ఉదృతి తగ్గడంతో.. సోమశిల ప్రాజెక్ట్ కి వచ్చే ఇన్ ఫ్లో తగ్గింది. దీంతో ఔట్ ఫ్లోను స్వల్పంగా తగ్గించారు అధికారులు. 

Tags: nellore nellore rains nellore district news nellore floods nellore flood water

సంబంధిత కథనాలు

Nellore Farmers: నెల్లూరులో తగ్గిన వరదలు.. ఇంతలో మరో సమస్య, అవస్థలు పడుతున్న రైతులు 

Nellore Farmers: నెల్లూరులో తగ్గిన వరదలు.. ఇంతలో మరో సమస్య, అవస్థలు పడుతున్న రైతులు 

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్

Nellore RedCross : రూ. 500కే ఐసీయూ ఆన్ వీల్స్.. నెల్లూరు వాసులకు రెడ్‌క్రాస్ సేవ !

Nellore RedCross :  రూ. 500కే ఐసీయూ ఆన్ వీల్స్.. నెల్లూరు వాసులకు రెడ్‌క్రాస్ సేవ !

Nellore Crime: భార్య వాట్సప్ చాటింగ్ చూసేవాడు.. అనుమానంతో వేధించేవాడు.. చివరకు.. 

Nellore Crime: భార్య వాట్సప్ చాటింగ్ చూసేవాడు.. అనుమానంతో వేధించేవాడు.. చివరకు.. 

JAGAN PROMISE: నెల్లూరుకి సీఎం జగన్ ఇచ్చిన హామీ నెరవేరేనా..?

JAGAN PROMISE: నెల్లూరుకి సీఎం జగన్ ఇచ్చిన హామీ నెరవేరేనా..?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!