అన్వేషించండి

రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత దుర్మరణం

తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కోలా వెంకటేశ్వర్లు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి నుంచి కారులో వెంకటగిరికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కోలా వెంకటేశ్వర్లు వైసీపీ తరపున జడ్పీటీసీగా ఉన్నారు. ఆయన వెంకటగిరిలో నివాసం ఉంటారు. వెంకటగిరి నుంచి తిరుపతి వెళ్లి, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి కారులో వెంకటగిరికి వస్తుండగా మార్గ మధ్యంలో రేణిగుంట మండలంలోని మర్రిగుంట వద్ద ప్రమాదం జరిగింది. ఇనుప లోడుతో వస్తున్న లారీని ఆయన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో జడ్పీటీసీ కోలా వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అదే కార్లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారి చొరవతో.. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల ఆనం రామనారాయణ రెడ్డి తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు తక్షణ వైద్యం అందేలా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు..


రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత దుర్మరణం

ఆనంకు సన్నిహితుడు

స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కోలా వెంకటేశ్వర్లు సన్నిహితుడు. ఆనంతోపాటే అన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటుంటారు. ఇటీవల వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. స్థానికంగా ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి హఠాత్తుగా ఇలా రోడ్డు ప్రమాదానికి బలికావడంతో వెంకటగిరివాసులు షాకయ్యారు.

ప్రమాదానికి కారణం ఏంటి..?

ప్రమాదానికి కారణం అతివేగమా, లేక నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడమా అనేది తేలాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్ లో వెంకటేశ్వర్లు చనిపోయారు. ఆసమయంలో ఆయనే కారు డ్రైవ్ చేస్తున్నారు. మిగతా ముగ్గురు గాయాలతో బయటపడటం విశేషం. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిలో మర్రిగుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది.

వైసీపీ నాయకుల సంతాపం..

జడ్పీటీసీ కోలా వెంకటేశ్వర్లు మృతి చెందడంతో ఎమ్మెల్యే ఆనం రామననారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతలు ఆయన ఈ ఘటనపై సంతాపం తెలిపారు. వెంకటగిరికి ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు. పార్టీ తరపున కూడా కుటుంబ సభ్యులకు సంతాప సందేశం అందింది.

టాప్ హెడ్ లైన్స్

Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
AP Rains Alert: ముంచుకొస్తున్నఅర్ణబ్‌ తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
ముంచుకొస్తున్నఅర్ణబ్‌ తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
AP Local Body Elections: పట్టణ స్థానిక పోరులో కూటమి హవా- జగన్, పెద్దిరెడ్డి కంచుకోటల్లో 6 సహా 12 చైర్మన్లు ఏకగ్రీవం!
పట్టణ స్థానిక పోరులో కూటమి హవా- జగన్, పెద్దిరెడ్డి కంచుకోటల్లో 6 సహా 12 చైర్మన్లు ఏకగ్రీవం!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget