అన్వేషించండి

Nellore Crime News: నెల్లూరులో కేటుగాళ్లు.. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లోనే దోపిడీ

Nellore Thieves: సీసీ కెమెరాలకు దొరక్కుండా దొంగతనాలు చేస్తున్న నలుగురిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ప్లాన్లు చూసి ఆశ్చర్యపోయారు.

Andhra Pradesh Crime News: ఆ నలుగురు యువకులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు మొదలు పెట్టారు. అయితే వారు చేసిన దొంగతనాల కేసుల్లో ఎక్కడా చిన్న క్లూ కూడా వదిలేవారు కాదు. సీసీ కెమెరాలు లేని ఏరియాల్లోనే పక్కాగా రెక్కీ నిర్వహించి దొంగతనం చేసేవారు. అనుకోకుండా పోలీసులకు దొరికారు. 

క్రైమ్ సీన్ లో సీసీ కెమెరాలే ఇప్పుడు కీలక సాక్ష్యాలు. ఒకవేళ వాటిని ధ్వంసం చేసినా.. అలా చేస్తున్నప్పుడు కెమెరాల్లో కదలికలు రికార్డ్ అవుతాయి. వాటి ద్వారా ఆనవాళ్లు పట్టేస్తారు పోలీసులు. ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకున్నారు నెల్లూరులో నలుగురు దొంగలు. అసలు సీసీ కెమెరాల జాడే లేని ఏరియాల్లో దొంగతనాలు చేస్తూ దర్జాగా తిరుగుతున్నారు. వైన్ షాపు దగ్గర వారి పరిచయం ఏర్పడింది. ఎవరికి వారు విడివిడిగా దొంగతనాలు చేసేవారు. ఆ తర్వాత నలుగురు జట్టు కట్టారు. గతంలో కొన్నిసార్లు అరెస్టై జైలుకి వెళ్లొచ్చారు. జైలుకెళ్లొచ్చిన తర్వాత తెలివి మీరారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంపిక చేసుకుని మరీ దొంగతనాలు మొదలు పెట్టారు. ఇటీవల వరుస చోరీలపై పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతుండే సరికి పోలీసులు నిఘా పెట్టారు. ఆ పని పాత నేరస్థులదేనని తేల్చారు. సురేష్‌ , కిశోర్‌, సిద్దూ, మహేష్‌.. ఆ నలుగురు దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని రిత్విక్‌ ఎన్‌క్లేవ్‌ లో ఓ మోటార్‌ సైకిల్ ని వీరు దొంగిలించారు. మరో ఇంట్లో అరకేజీ వెండి వస్తువులు కాజేశారు. మాగుంట లేఅవుట్‌లోని ఓ కన్సల్టెన్సీ ఆఫీస్ లో ల్యాప్‌టాప్‌ చోరీ చేశారు. ఆకుతోట సమీపంలోని గవర్నమెంట్ వైన్ షాప్ లో 2 లక్షల రూపాయలకు పైగా దోపిడీ చేశారు. పొదలకూరు రోడ్ లోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి వెండి వస్తువులు, ల్యాప్‌ టాప్‌ లు చోరీ చేశారు. నెల్లూరులోనే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీరు పక్కా ప్లానింగ్ తో దొంగతనాలు చేస్తున్నారు. మనుబోలు గ్రామంలో సబ్‌ పోస్టాఫీసులో క్యాష్‌ బాక్స్‌ ని కూడా దోచుకున్నారు. మరో చోట కేజీ 300 గ్రాముల వెండి దోచుకున్నారు. వెంకటాచలంలో కూడా వైన్ షాప్ వాచ్‌ మెన్‌ పై కత్తులతో దాడిసి అతడిని గాయపరిచారు. షాప్ నుంచి రెండున్నర లక్షల రూపాయలు, వైన్ బాటిల్స్ దోచుకెళ్లారు. 

Also Read: నెల్లూరులో పరువు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి!

ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కేజీల వెండి వస్తువులు, బైక్‌, మూడు ల్యాప్‌టాప్‌లు, రూ.60 వేల క్యాష్.. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు పోలీసులు. మొత్తం రూ.6 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశామని తెలిపారు. వీరిలో ఇద్దరిపై చెరో 20 కేసులు ఉన్నాయి, మరో నిందితుడిపై 11 పాత కేసులున్నాయి. ఇంకొకడిపై 8 కేసులున్నాయి. వీరంతా పాతికేళ్ల లోపువారే. జల్సాలకు అలవాటు పడి, నేరస్థులుగా జీవితం గడుపుతున్నారు. జైలుకి వెళ్లొచ్చినా, తిరిగి దొంగతనాలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్నారు. 

Also Read:  కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు - 14 రోజుల రిమాండ్

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget