News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nellore Police Vs Anitha: వంగలపూడి అనిత వ్యాఖ్యల దుమారం! సారీ చెప్పాలని పోలీసుల డిమాండ్, మరి చెప్తారా?

Nellore News: నెల్లూరు నగరంలో జరిగిన నారీ సంకల్ప దీక్షలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

FOLLOW US: 
Share:

Nellore: నెల్లూరు (Nellore) నగరంలో టీడీపీ (TDP) ఆధ్వర్యంలో జరిగిన నారీ సంకల్ప దీక్షలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత (Vangalapudi Anitha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెల్లూరు జిల్లా ఎస్పీ (Nellore SP) విజయరావుపై ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు దాష్టీకాలకు పాల్పడుతూ పైశాచికానందాన్ని పొందుతున్నారని విమర్శించిన అనిత.. నెల్లూరు జిల్లా విషయానికొచ్చే సరికి ఎస్పీని టార్గెట్ చేశారు. అసలు ఎస్పీ ఐపీఎస్ చదివే పాసయ్యారా అని డౌట్ ఉందని అన్నారు. గ్రావెల్ తవ్వకాల్లో బాధితులు ఫిర్యాదు చేస్తే.. వారినే అక్రమంగా అరెస్ట్ చేశారని, నైటీలతో ఉన్న మహిళల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారని, మీ తల్లి, భార్యని కూడా అలాగే బయటకు పంపిస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతల విషయంలో మగ టైలర్స్ తో కొలతలు తీసిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తప్పు చేసిన పోలీసులే ఆవీడియో ఎలా బయటకొచ్చిందంటూ ఎంక్వయిరీ చేయడం ఏంటని మండిపడ్డారు. 

నారీ సంకల్ప దీక్షలో అనిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అనిత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నెల్లూరు జిల్లా పోలీసులు మండిపడ్డారు. ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు జిల్లా పోలీసు అధికారుల సంఘం సహా.. ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు.. తమ ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఖండన ప్రకటన విడుదల చేశారు. ఆదివారం సభలో అనిత ఈ వ్యాఖ్యలు చేయగా.. సాయంత్రానికి పోలీసులంతా ప్రెస్ మీట్లు పెట్టి ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు. ఎస్పీకి మద్దతుగా నిలిచారు.

మాజీ ఎమ్మెల్యే అనిత (Ex MLA Anitha) వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా పోలీసులు (Nellore SP) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాలకోసం ఒక IPS అధికారి గురించి అనుచితంగా మాట్లాడడం అత్యంత హేయమైన చర్య అని ఖండించారు. మహిళలకు, పిల్లల సమస్యలకు అధిక ప్రాధాన్యత కల్పించి పరిష్కరిస్తున్న ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అని అన్నారు. మహిళా పోలీసుల యూనిఫాం కొలతలు తీసుకునే సమయంలో మహిళ అయిన అడిషనల్ ఎస్పీ అక్కడే ఉన్నారని, రాజకీయ మనుగడ కోసం అసంపూర్ణ సమాచారంతో అసంబద్ధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ లో ఎంపికపై వారిపై అనాలోచితంగా మాట్లాడడం అనిత అజ్ఞానాన్ని తెలియజేస్తోందన్నారు. జిల్లా ఎస్పీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిత వెంటనే ఎస్పీకి, పోలీస్ డిపార్ట్ మెంట్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

అనిత (Anitha) సారీ చెబుతారా..?
ప్రస్తుతానికి పోలీసుల డిమాండ్ పై టీడీపీ నుంచి స్పందన లేదు. టీడీపీ నేత అనిత చేసిన వ్యాఖ్యలు, అనంతరం పోలీసుల ప్రెస్ మీట్లపై స్థానిక నేతలు ఇంకా స్పందించలేదు. అయితే అనిత సారీ చెప్పాల్సిందేనంటూ నెల్లూరు జిల్లా పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ పనితీరుని శంకించడంతోపాటు, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం సరికాదంటున్నారు. రాజకీయ స్వలాభం కోసం నాయకులు ఇలా మాట్లాడితే పోలీస్ డిపార్ట్ మెంట్ మాటలు పడాలా అంటూ నిలదీశారు. ఈ వ్యవహారంపై ఈరోజు మరింత చర్చ జరిగే అవకాశముంది. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి.

Published at : 07 Mar 2022 09:43 AM (IST) Tags: Tdp latest news nellore police nellore sp Vangalapudi Anitha vijaya rao ips Vangalapudi Anitha Comments

ఇవి కూడా చూడండి

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ

APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 

Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు

Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు

టాప్ స్టోరీస్

MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్ 

Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్