News
News
X

నెల్లూరులో మైనార్టీ ఓటర్లు ఎటువైపు? నాయకుల హడావిడి దేనికోసం..?

2024 ఎన్నికలనాటికి మైనార్టీ ఓటర్లపై టీడీపీ బలంగా నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు, అదే నియోజకవర్గం నుంచి అబ్దుల అజీజ్ బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది.

FOLLOW US: 
 
నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో మైనార్టీ ఓటర్లు చాలా కీలకం. అందుకే మైనార్టీలను ఆకట్టుకునే కార్యక్రమాలకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఇక సిటీ నియోజకవర్గంలో మైనార్టీ నేతలెవరూ పోటీ చేయడంలేదు కాబట్టి ఆ ఓట్లు రెండు పార్టీల మధ్య చీలుతుంటాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్ పోటీకి దిగారు. వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే అజీజ్ వైసీపీలో తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టి, నెల్లూరు నగర మేయర్ గా గెలిచి, వెంటనే టీడీపీలోకి వెళ్లడం చాలామందికి నచ్చలేదు. అందుకే ఆయన టీడీపీ తరపున పోటీ చేసినా విజయం వరించలేదు.

2024 ఎన్నికలనాటికి మైనార్టీ ఓటర్లపై టీడీపీ బలంగా నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు, అదే నియోజకవర్గం నుంచి అబ్దుల అజీజ్ బరిలో నిలుస్తారనే ప్రచారం ఉంది. 2019లో అజీజ్ పై శ్రీధర్ రెడ్డి 22వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి మైనార్టీ ఓట్లను గుంప గుత్తగా టీడీపీ సంపాదించాలని చూస్తోంది. సంప్రదాయ ఓటర్లు వైసీపీ, టీడీపీ మధ్య చీలినా, మైనార్టీ ఓటర్లు తమ వర్గానికి చెందిన నాయకుడికే మద్దతిస్తే మాత్రం రూరల్ లో టీడీపీకి పరిస్థితి అనుకూలిస్తుంది. అందుకే అబ్దుల్ అజీజ్ ఇటీవల కాలంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

మైనార్టీ ఓట్లపై దృష్టి పెట్టిన శ్రీధర్ రెడ్డి.

News Reels

రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా మైనార్టీ ఓటర్లపై దృష్టిపెట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 30 నుంచి 35 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ మొత్తం ఓట్లను పోలరైజ్ చేసేందుకు అబ్దుల్ అజీజ్ ఓవైపు ఎత్తులు వేస్తుంటే మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాత్రం తనదైన శైలిలో ఎత్తులు వేస్తూ ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి వారితో మాటామంతి కలుపుతూ ముందుకు సాగిపోతున్నారు.

టీడీపీ హయాంలో షాదీ మంజిల్ ల నిర్మాణం మొదలైనా, వైసీపీ టైమ్ లో అవి పూర్తయ్యాయి. దీంతో ముస్లిం ఓటర్లలో వైసీపీ తమకు మేలు చేసిందనే భావన ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో షాదీ తోఫా కార్యక్రమాన్ని వైసీపీ కూడా తిరిగి పునరుద్ధరించడంతో ఆ పార్టీపై పెద్దగా వ్యతిరేకత కనిపించడంలేదు. నెల్లూరు రూరల్ లో మైనార్టీ ఓటర్లు కీలకంగానే ఉన్నా ఎప్పుడూ పార్టీల మధ్య వారి ఓట్లు చీలిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం వారి ఓట్లను గట్టిగా ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నారు నాయకులు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ విషయంలో ముందడుగులో ఉన్నట్టు తెలుస్తోంది. బారా షహీద్ దర్గా అభివృద్ధి, రొట్టెల పండగ ఏర్పాట్ల విషయంలో ఆయన బాగా హడావిడి చేశారు. అయితే నిధులిచ్చారు కానీ, కార్యక్రమాలు జరగలేదంటూ ఇటు టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ హయాంలో జరిగిన పనుల్నే, ఇప్పుడు వైసీపీ నేతలు తాము చేశామని చెప్పుకుంటున్నారని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు మైనార్టీ ఓటర్లు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి.

Published at : 11 Nov 2022 06:54 PM (IST) Tags: Kotamreddy Sridhar Reddy Nellore Rural MLA nellore update Nellore News abdul ajeej

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక- ఈనెల 8 నుంచి వర్షాలు!

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక-  ఈనెల 8 నుంచి వర్షాలు!

బుధవారం నెల్లూరు రానున్న సీఎం జగన్- 15 నిమిషాల పర్యటనకు భారీ భద్రత

బుధవారం నెల్లూరు రానున్న సీఎం జగన్- 15 నిమిషాల పర్యటనకు భారీ భద్రత

AP News Developments Today: నేడు కీలక నేతలంతా ఢిల్లీ కి వెళ్లనున్నారు- ఏపీలో ఇవాల్టీ కీలక అప్‌డేట్స్‌ ఇవే!

AP News Developments Today: నేడు కీలక నేతలంతా ఢిల్లీ కి వెళ్లనున్నారు- ఏపీలో ఇవాల్టీ కీలక అప్‌డేట్స్‌ ఇవే!

Weather Latest Update: ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షావరణం

Weather Latest Update: ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షావరణం

టాప్ స్టోరీస్

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!