అన్వేషించండి

Nellore Woman Protest: ఆ లీడర్స్ పేర్లు బయటపెట్టి సూసైడ్ చేసుకుంటా! మహిళా ఉద్యోగి నిరసన

Nellore News వింజమూరు మండలం ఎంపీడీవో ఆఫీస్ ముందు మహిళా ఉద్యోగి శిరీష ఆందోళన చేపట్టారు. వింజమూరులో తనను జాయిన్ చేసుకోకుండా ఎంపీడీవో స్వరూపరాణి వేధిస్తున్నారని ఆరోపించారు శిరీష.

Nellore: ఆమె ఓ మహిళా ఉద్యోగి. పేరు శిరీష. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ లో అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) గా ఉద్యోగం చేస్తోంది. భర్త లేడు, ఇద్దరు పిల్లలతో ఆమె కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. సాధారణ బదిలీలలో భాగంగా గత నెల ఆమెను పక్కనే ఉన్న వింజమూరు మండలానికి బదిలీ చేశారు. వింజమూరు మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ లో ఆమె విధుల్లో చేరాల్సి ఉంది. బదిలీ ఉత్తర్వులు తీసుకెళ్లి ఎంపీడీవోకి అప్పగించారు. అయితే అప్పటికే ఆమెపై కొంతమంది స్థానిక నేతలు ఎంపీడీవోకి లేనిపోని చాడీలు చెప్పారట. దీంతో ఆమెను విధుల్లో చేర్చుకోకుండా ఎంపీడీవో ఆర్డర్ తీసుకోలేదు. ఎమ్మెల్యేని కానీ, లేదా జడ్జీ సీఈవోని కానీ కలిసి రమ్మని చెప్పింది. దీంతో చేసేదేం లేక ఆఫీస్ ముందు నిరసనకు దిగింది మహిళా ఉద్యోగి శిరీష. 

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎంపీడీవో ఆఫీస్ ముందు మహిళా ఉద్యోగి శిరీష ఆందోళన చేపట్టారు. వరికుంటపాటు ఎంపీడీవో కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న ఆమెను సాధారణ బదిలీలలో భాగంగా వింజమూరు బదిలీ చేశారు. అయితే వింజమూరులో ఆమెను జాయిన్ చేసుకోలేదు ఎంపీడీవో స్వరూప రాణి. తనను వరికుంటపాడు నుంచి వింజమూరుకు తనను ట్రాన్స్ ఫర్ చేశారని, కానీ వింజమూరులో తనను జాయిన్ చేసుకోకుండా ఎంపీడీవో స్వరూపరాణి వేధిస్తున్నారని ఆరోపించారు శిరీష. తనపై కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, వారందరి పేర్లు బయటపెట్టి తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆఫీస్ లో జాయిన్ చేసుకోవాల్సిన ఎంపీడీవో.. ఎమ్మెల్యేను కలవాలని, లేదా జడ్పీ సీఈవోను కలవాలని చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు శిరీష.Nellore Woman Protest: ఆ లీడర్స్ పేర్లు బయటపెట్టి సూసైడ్ చేసుకుంటా! మహిళా ఉద్యోగి నిరసన

ఎందుకీ ఒత్తిడి..?
సాధారణంగా ఉద్యోగిని బదిలీ చేసిన తర్వాత ఆమెకు ఆ స్థానం ఇష్టం లేకపోయినా, లేదా రాజకీయ ఒత్తిడి ఉన్నా కూడా సదరు ఉద్యోగికి ఆ విషయం చెప్పి సర్ది చెప్పుకుని వేరే చోటకు బదిలీ చేస్తుంటారు. కానీ ఇక్కడ శిరీషకు ముందస్తుగా అలాంటి సమాచారమేదీ లేదు. వరికుంటపాడునుంచి వింజమూరికి ట్రాన్స్ ఫర్ చేశారు. కానీ వింజమూరులో ఆమెను జాయిన్ చేసుకోలేదు. దీంతో ఎటూ పోలేక ఇబ్బంది పడుతోంది శిరీష. 

ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటారా?
ఎంపీడీవో మాత్రం ఆమెను జడ్పీ సీఈవోని కలసి రావాలని చెబుతున్నారు. అక్కడకు వెళ్లి ట్రాన్స్ ఫర్ విషయం తేల్చుకోవాలని సూచిస్తున్నారు. కానీ రాజకీయ ఒత్తిడుల వల్లే శిరీషను వింజమూరులు ఎంపీడీవో ఆఫీస్ లో విధుల్లోకి తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు తనపై కక్షకట్టారని ఆరోపిస్తున్నారు శిరీష. వారందరి పేర్లు తాను బయటపెడతానని, వారి పేర్లు బయటపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నారు. తనకు  భర్త లేడని, ఇద్దరు పిల్లలతో తాను అవస్థలు పడుతున్నానని, ఇప్పుడిలా బదిలీల పేరుతో తనను ఇబ్బంది పెట్టడం సరికాదంటోంది శిరీష. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget