అన్వేషించండి

Nellore drugs manufacturing unit: అరె ఏంట్రా ఇది! - ఇంటర్నెట్ లో చూసి డ్రగ్స్ తయారు చేస్తున్న నెల్లూరు కేటుగాళ్లు

Nellore Drugs News: గతంలో డ్రగ్స్ రవాణా, వినియోగంపైనే కేసులు నమోదయ్యాయి. ఈసారి ఏకంగా డ్రగ్స్ తయారీ కేంద్రమే నెల్లూరులో బయటపడటంతో పోలీసులు షాకయ్యారు. ఇంకెక్కడైనా జరుగుతున్నాయేమోనని ఆరా తీస్తున్నారు. 

Nellore Crime News: నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిని చాలాసార్లు పోలీసులు అరెస్ట్ చేశారు కానీ, ఈసారి ఈ కేసులోనే పెద్ద ట్విస్ట్ ఉంది. వీళ్లు లోకల్ గానే డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఇంటర్నెట్ చూసి డ్రగ్స్ తయారీ నేర్చుకున్నామని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ కేటుగాళ్లు అసలు నిజం చెప్పడంతో ఖాకీలు షాకయ్యారు. నెల్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కుటీర పరిశ్రమలాగా డ్రగ్స్ తయారీ మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు చిక్కారు. 

మత్తువదలరా అనే తెలుగు సినిమాలో ఓ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ తయారు చేస్తుంటారు. సరిగ్గా ఈ సినిమాలోని సీన్ నెల్లూరులో జరిగింది. నెల్లూరు రూరల్ మండలంలోని ధనలక్ష్మీపురం సామంతులవారితోపు, ఏవీరెడ్డి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ తయారీపై పోలీసులకు సమాచారం రావడంతో వారు సడన్ గా రైడ్ చేశారు. అక్కడున్న డంప్ చూసి షాకయ్యారు. 

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.సాత్విక్‌ అనే యువకుడు బీటెక్‌ చదివి పలు ఉద్యోగాలు చేశాడు. ఈజీ మనీకి అలవాటు పడి ఉద్యోగం వదిలేసి మోసాలకు అలవాటు పడ్డాడు. గూడూరు రాజీపేటకు చెందిన శ్రీనివాసులు, మొగళ్లపాలేనికి చెందిన ఎం.బాబు, గూడూరు రైల్వేస్టేషన్‌ లో బిర్యానీ, టీ అమ్ముకునే కె.వెంకయ్య, వినోద్ తో ఓ ముఠాని ఏర్పాటు చేశాడు. నెల్లూరు బాలాజీనగర్‌ కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పి.వేణుగోపాల్‌ రెడ్డి అలియాస్‌ వేణురెడ్డి సూచన మేరకు డ్రగ్స్ తయారీ మొదలు పెట్టాడు సాత్విక్. నిషేధిత మత్తు పదార్థాలైన మెఫేడ్రోన్‌ లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని, వాటిని తయారుచేసి తనకు ఇస్తే కమీషన్‌ ఇస్తానని సాత్విక్‌ కు వేణురెడ్డి చెప్పాడు. దీంతో ఈ మత్తుమందు తయారీ మొదలు పెట్టాడు సాత్విక్. 

ఇంటర్నెట్ లో సెర్చ్ ఆపరేషన్..
డ్రగ్స్ ఎలా తయారు చేయాలనే విషయాన్ని సాత్విక్ ఇంటర్నెట్ లో వెదికి తెలుసుకున్నాడు. మత్తుమందు తయారీకి ఏయే పదార్థాలు కావాలో లిస్ట్ రాసుకున్నాడు. ఇంటర్నెట్ లోనే ఆర్డర్ ఇచ్చి రూ.2.60 లక్షలతో అవసరమైన మిషనరీని కొనుగోలు చేశాడు. అవసరమైన రసాయనాలను తిరుపతిలోని ఓ బయో సైంటిఫిక్‌ దుకాణంలో కొన్నాడు. తయారీ మొదలు పెట్టాడు. అయితే చుట్టుపక్కలవారికి వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. వారి ద్వారా విషయం పోలీసులకు చేరింది. పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టారు. చివరకు అక్కడ ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్థారించారు. సడన్ గా రైడ్ చేయడంతో అసలు బండారం బట్టబయలైంది. 

ఆ ఇంట్లో ఏమేమున్నాయంటే..?
నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ డి.హిమవతి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఇన్‌ స్పెక్టర్‌ పి.శ్రీనివాసులురెడ్డి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, డ్రగ్స్‌ కంట్రోల్‌, రెవెన్యూ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ.15లక్షల విలువైన 560 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 48 రకాల వస్తువులు, సెల్‌ ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌ రెడ్డి మాత్రం పోలీసులకు దొరకలేదు. డ్రగ్స్‌ తయారీ కేంద్రంపై దాడి చేసి మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

గతంలో కేవలం డ్రగ్స్ రవాణా, వినియోగంపైనే కేసులు నమోదయ్యాయి. ఈసారి ఏకంగా డ్రగ్స్ తయారీ కేంద్రమే నెల్లూరులో బయటపడటంతో పోలీసులు షాకయ్యారు. ఇలాంటి కార్యకలాపాలు ఇంకెక్కడైనా జరుగుతున్నాయేమోనని ఆరా తీస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget