News
News
X

Nellore Bus Driver Death: చనిపోతూనే 42 మందిని కాపాడిన బస్ డ్రైవర్, విషాదంలో అయ్యప్పస్వాములు

అప్పటికే భాస్కర్ రావు గుండె నొప్పితో అవస్థ పడుతున్నారు. వారు భాస్కర్ రావు వద్దకు వచ్చి పలకరించారు. అప్పటికే ఆయనలో ఉలుకూ పలుకు లేదు. పడుకున్న వ్యక్తి పడుకున్నట్టుగానే ప్రాణాలు వదిలాడు.

FOLLOW US: 
 
ఇటీవల అయ్యప్ప స్వాముల బస్సులకు ఘోర ప్రమాదాలు చూశాం. ఇది కూడా అలాంటిదే. అయితే ఆ ఘోరం తృటిలో తప్పిపోయింది. క్షణకాలం ఆలస్యం అయిఉంటే 42 మంది అయ్యప్ప స్వాముల పరిస్థితి ఏమయ్యేదో చెప్పలేం. కానీ నెల్లూరు జిల్లాలో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. స్వామి శరణం అంటూ బస్సుదిగి ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది. ఆ బస్సులో ఏమైంది..?

అసలేమైంది..?

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన 42 మంది అయ్యప్ప స్వాములు మాలధారణ చేసి శబరిమలకు బయలుదేరారు. నెల 16న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుని వారు మాట్లాడుకున్నారు. శబరి యాత్ర మొదలైంది. దర్శనీయ ప్రాంతాలలో బస చేస్తూ వారు యాత్రకు బయలుదేరారు. గురువారం సాయంత్రం బస్సు నెల్లూరు జిల్లాకు చేరుకుంది. బోగోలు మండలంలోని కడనూతల చెరువు ప్రాంతానికి చేరుకునేసరికి బస్సు డ్రైవర్‌ భాస్కర్‌ రావు (38) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండె నొప్పి అనిపించింది. అప్పటికీ కొంత దూరం బస్సుని అలాగే నడిపాడు.

తీరా బస్సు కడనూతల వద్ద ఓ ఫ్లైవర్ పైకి వచ్చేసరికి బస్సు నడపలేకపోయారు భాస్కర్ రావు. బస్సుని ఓ రోడ్డుపక్కన ఆపేశారు. డ్రైవర్ సీటు వెనకే విశ్రాంతి తీసుకునే బల్లపై కూర్చున్నాడు. ఎక్కువసేపు కూర్చులేక అక్కడే పడుకున్నాడు. ఆ సమయానికి తన పరిస్థితి ఇదీ అని బస్సులో వెళ్లేవారికి కూడా ఆయన చెప్పలేకపోయారు. సడన్ గా బస్సు రోడ్డుపక్కన ఆపేసే సరికి స్వాములు డ్రైవర్ సీటు వద్దకు వచ్చారు. అప్పటికే భాస్కర్ రావు గుండె నొప్పితో అవస్థ పడుతున్నారు. వారు భాస్కర్ రావు వద్దకు వచ్చి పలకరించారు. అప్పటికే ఆయనలో ఉలుకూ పలుకు లేదు. పడుకున్న వ్యక్తి పడుకున్నట్టుగానే ప్రాణాలు వదిలాడు.

News Reels

మా ప్రాణాలు కాపాడి..

బస్సు నడుపుతూ డ్రైవర్ అస్వస్థతకు గురైతే ఆ బస్సు ఎక్కడో ఒకచోట ఢీకొని ఆగిపోయిన ఉదాహరణలు ఇటీవల కాలంలో చాలానే ఉన్నాయి. కానీ ఈ డ్రైవర్ ఆలా కాదు. తనకి ఉన్న ఇబ్బందిని ముందే పసిగట్టాడు. బస్సుని నడిపితే తనతోపాటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారనే అవగాహనకు వచ్చాడు. వెంటనే బస్సుని రోడ్డు పక్కన ఆపేశాడు. ఆయన వెనక సీట్లో కుప్పకూలి చనిపోయాడు.

భాస్కర్ రావు మృతదేహం తరలింపు..

భాస్కర్‌రావు మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం, ఎ.కోడూరుకు అంబులెన్స్ లో తరలించారు స్వాములు. బస్సు యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. 42మంది స్వాములు భాస్కర్ రావే తమ ప్రాణాలను కాపాడారని, ప్రమాదం జరక్కుండా నివారించారని అంటున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెల్లూరు జిల్లాతో పాటు అయ్యప్ప స్వాములు బయలుదేరిన కాకినాడ జిల్లావాసులు కూడా ఈ వార్త తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. స్వాములకు వారి కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి ఆరా తీసారు. భాస్కర్ రావు కుటుంబానికి కూడా స్వాములు అండగా ఉంటామని చెప్పారు.

Published at : 25 Nov 2022 08:38 AM (IST) Tags: Nellore Crime Nellore News ayyappa swamula bus bus driver nellore bus driver death

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

నాపై, నా కుటుంబంపై కుట్ర- సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే!

నాపై, నా కుటుంబంపై కుట్ర- సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే!

AP News Developments Today: ఏపీలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఏమున్నాయంటే?

AP News Developments Today: ఏపీలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఏమున్నాయంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Srikakulam Crime News: వీధుల్లో ఈడ్చుకెళ్తూ వ్యక్తిపై దాడి - నెట్టింట ప్రత్యక్షమైన వీడియోలు! 

Srikakulam Crime News: వీధుల్లో ఈడ్చుకెళ్తూ వ్యక్తిపై దాడి - నెట్టింట ప్రత్యక్షమైన వీడియోలు! 

టాప్ స్టోరీస్

Bandi Sanjay on Sajjala Comments : కమీషన్ల ఒప్పందంతో ఇద్దరు సీఎంలు డ్రామాలు, కవిత కేసు పక్కదోవ పట్టించేందుకు కుట్ర - బండి సంజయ్

Bandi Sanjay on Sajjala Comments : కమీషన్ల ఒప్పందంతో ఇద్దరు సీఎంలు డ్రామాలు, కవిత కేసు పక్కదోవ పట్టించేందుకు కుట్ర - బండి సంజయ్

AP BJP Reaction On Sajjla : మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

AP BJP Reaction On Sajjla :  మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!