News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP IT Minister Passes Away: ఆత్మకూరులో మేకపాటి అభిమానులు కన్నీరుమున్నీరు, వైఎస్ జగన్‌కు సైతం తీరని లోటు

Goutham Reddy Death News Live: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో సొంత నియోజకవర్గంలో విషాదం అలుముకుంది. అతి చిన్న వయసులోనే ఆయన మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

FOLLOW US: 
Share:

Atmakur People Crying For Mekapati Goutham Reddy: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో సొంత నియోజకవర్గంలో విషాదం అలుముకుంది. అతి చిన్న వయసులోనే ఆయన మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వరుసగా రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో వైఎస్సార్‌సీపీ నేతలు చాలా మంది ఓటమిపాలైనా తొలిసారి పోటీచేసిన గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. పార్టీ కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా చూసుకున్నారు. ముఖ్యంగా యువ నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించారు.

నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రభుత్వ సిబ్బంది సైతం శ్రద్ధాంజలి ఘటించారు. ఆత్మకూరులోని దాదాపు అన్ని కూడళ్లలో ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నేతలు, కార్యకర్తలు, గౌతమ్ రెడ్డి అభిమానులు నివాళులర్పించారు. రెండోసారి ఆత్మకూరు నుంచి పోటీ చేసి గెలుపొందిన మేకపాటి గౌతమ్ రెడ్డి.. 2019లో పార్టీ అధికారంలోకి రావడంతో ఏపీ కేబినెట్‌లో చేరారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తరచూ ఆత్మకూరుకి వస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులోని మంత్రి పార్టీ కార్యాలయం శ్రీ కీర్తి నిలయం శోకసంద్రంగా మారిపోయింది.

వైఎస్ జగన్‌కు తీరని లోటు.. 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితులని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మేకపాటి కుటుంబానికి ఆనం ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండో దఫా కొవిడ్ సోకిన తర్వాత మంత్రి మేకపాటి ఆరోగ్యం కాస్త క్షీణించిందన్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఆయన అస్వస్థతకు గురై గుండెపోటు (AP IT Minister Passes Away) వచ్చి ఉంటుందని ఆనం పేర్కొన్నారు. మేకపాటి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

రెండు రోజులు సంతాపదినాలు.. 
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఎల్లుండి నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. నేటి రాత్రికి హైదరాబాద్ నుండి నెల్లూరుకి గౌతం రెడ్డి పార్థివదేహం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు నెల్లూరులో అభిమానులు పార్థివ దేహం‌ దర్శించుకుంటారు. అమెరికాలో చదువుకుంటున్న గౌతమ్ రెడ్డి కుమార్ రెడ్డి రావాల్సి ఉంది. 

Also Read: Mekapati Goutam Reddy Passed Away: ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం

Also Read: Mekapati Goutham Reddy Passed Away: వ్యాపారంలో సక్సెస్, పాలిటిక్స్‌లో మేటి ! గౌతమ్ రెడ్డికి సంబంధించిన ముఖ్య విశేషాలు ఇవే..

Published at : 21 Feb 2022 02:42 PM (IST) Tags: Mekapati Goutham Reddy Anam Ramanarayana Reddy Mekapati Goutham Reddy Passes Away AP Minister Mekapati Goutham Reddy Goutham Reddy Goutham Reddy

ఇవి కూడా చూడండి

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం

SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్