Lalitha Jewellery MD Kiran Kumar: సామాన్యుడిలా రోడ్డుపక్కన టిఫిన్ చేసిన లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ - ఇలా ఎందుకు తిన్నారంటే ?
Lalitha Jewellery MD Kiran Kumar: పెద్ద బిజినెస్‌మ్యాన్ ఇలా ఓ రోడ్డు పక్కన టిఫిన్ బండి వద్ద బ్రేక్ పాస్ట్ చేశారంటే ఆశ్చర్యమే. వాస్తవానికి కిరణ్ కుమార్ ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉంటారన్నారు సన్నిహితులు.
Business Man Spotted In Nellore District: నెల్లూరులో రోడ్డుపక్కన టిఫిన్ బండ్లు ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంటాయి. బండి చుట్టూ జనం నిలబడి టిఫిన్ చేయడం కూడా పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఆ బండి దగ్గర టిఫిన్ చేసే వ్యక్తి ఓ కోటీశ్వరుడైతే అదే పెద్ద విశేషం. సరిగ్గా నెల్లూరులో కూడా అదే జరిగింది. రోడ్డుపక్కన టిఫిన్ బండి వద్దకు ఓ కోటీశ్వరుడు వచ్చారు. అక్కడే అందరితో కలసి టిఫిన్ చేశారు. ఆయన ఎవరికీ తెలియని వ్యక్తి కాదు, నెల్లూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయిన సెలబ్రిటీ. ఆయన పేరే కిరణ్ కుమార్. లలితా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్.
ఆయన గుండు.. ఓ పెద్ద బ్రాండ్..
వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసే లలితా జ్యువెలరీ సంస్థ నెల్లూరునుంచే ప్రస్థానం మొదలైనా.. తమిళనాడులో అనేక బ్రాంచ్ లు స్థాపించి అందరి దృష్టినీ ఆకర్షించారు కిరణ్ కుమార్. 1999లో లలిత జ్యువెలరీని టేకోవర్ చేసిన కిరణ్ కుమార్ అంచెలంచెలుగా ఎదిగారు. తన సంస్థకు తానే ఓ పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగారు.
డబ్బులు ఊరికే రావు.. ఆ మాట వినగానే అందరికీ కిరణ్ కుమార్ గుర్తుకొస్తారనడంలో అతిశయోక్తి లేదు. సినిమా వాళ్లు, క్రీడాకారులు, మోడల్స్ నటిస్తేనే అడ్వర్టైజ్ మెంట్లు సక్సెస్ అవుతాయనుకునే క్రమంలో తనకు తానే ఓ బ్రాండ్ గా మారి గుండుతో అడ్వర్టైజ్ మెంట్ లో నటించి సూపర్ హిట్ చేశారు కిరణ్ కుమార్. నాలుగు షాపులు తిరగండి, ఎక్కడ తక్కువైతే అక్కడ కొనండి.. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసురుతారాయన.
అలాంటి బిజీ బిజినెస్‌మ్యాన్ ఇలా ఓ రోడ్డు పక్కన టిఫిన్ బండి వద్ద బ్రేక్ పాస్ట్ చేస్తున్నారంటే ఆశ్చర్యమే. వాస్తవానికి కిరణ్ కుమార్ ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉంటారని అంటారు ఆయన సన్నిహితులు. తమిళనాడులో వ్యాపారాలున్నా.. వారం వారం నెల్లూరుకి వచ్చి వెళ్తుంటారని చెబుతారు. అలా వచ్చిన సందర్భంలో ఆయన తనకిష్టమైన వంటకాలను ఆస్వాదిస్తుంటారు. చిన్నప్పుడు తాను పుట్టి పెరిగిన ప్రాంతాలు, వ్యాపారంలోకి వచ్చే సమయంలో తాను తిరిగిన ప్రాంతాలను అలా ఓసారి పరికించడం ఆయనకు అలవాటు. ఆ అలవాటులో భాగంగానే ఆయన ఇంకా రోడ్డు పక్కనే ఇలా టిఫిన్ చేస్తుంటారు.
ఫైవ్ స్టార్ హోటల్స్‌లో టిఫిన్ చేసే స్థోమత ఉన్నా కూడా ఆయన ఇలా రోడ్డు పక్కన బండిని ఎంచుకోవడంలోనే ఆయన సింప్లిసిటీ దాగుంది అని సోషల్ మీడియా హోరెత్తుతోంది. నాలుగు బండ్లు చూడు, ఎక్కడ టిఫిన్ తక్కువ రేటుకి దొరుకుతుందో అక్కడే టిఫిన్ చెయ్.. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు అంటూ నెటిజన్లు కామెడీ కూడా చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు, మీడియా వ్యక్తులు కూడా కిరణ్ కుమార్ టిఫిన్ చేస్తున్న ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ డబ్బులు ఊరికే రావు అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తమ్మీద కిరణ్ కుమార్ ఏది చేసినా సెన్సేషనే అని అనిపిస్తోంది. ఎందుకంటే పబ్లిసిటీ కూాడా ఊరికే రాదుగా.
ఏపీ, తెలంగాణ సహా ఇతర సెక్షన్స్‌లో మరిన్ని లేటెస్ట్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి