అన్వేషించండి

నెల్లూరులో కేటుగాళ్ల కంత్రీ స్కెచ్- డాక్టర్‌తో లవ్ డ్రామా- 10 లక్షలు కాజేసే ప్లాన్ ఫెయిల్

పోలీస్ వేషంలో వచ్చిన యువకుడు, అతడితో పాటు సీన్ రక్తికట్టించిన ఆ ప్రియురాలు ఇద్దరూ కలసి డాక్టర్ కి టోపీ పెట్టారు. 10లక్షల రూపాయల పెద్ద మొత్తానికే టార్గెట్ పెట్టడంతో చివరకు దొరికిపోయారు

నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ క్రైమ్ కథ సినిమా సీన్లను మించిపోయేలా ఉంది. పార్కుల్లో, ప్రైవేట్ ప్లేసుల్లో జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేసే నకిలీ పోలీసుల్ని చాలామందినే చూసి ఉంటాం. అయితే ఇక్కడ ఆ జంటలో కూడా నకిలీ ప్రియురాలు ఉంది. ప్రియుడ్ని మోసం చేసింది, నకిలీ పోలీస్ తో చేతులు కలిపి మరింత గుంజేయాలని చూసింది. ఈ వ్యవహారంలో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. ఆ ప్రియురాలి చేతికి చిక్కి విలవిలలాడిపోయిన ప్రియుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే ప్రముఖ డాక్టర్ కావడం విశేషం. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా.. గుట్టుచప్పుడు కాకుండా అంతా ముగించేశారని సమాచారం. 

ఇంతకీ ఏం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లా కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ కి ఓ మహిళతో స్నేహం కుదిరింది. గతంలో ఆమె ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆమెతో మాట కలిపిన డాక్టర్, ఆ తర్వాత స్నేహాన్ని హద్దులు దాటించాడు. తరచూ వారిద్దరూ ప్రైవేట్ గా కలసుకునేవారు. అయితే సదరు మహిళకు మరో యువకుడితో కూడా సంబంధాలున్నాయి. డాక్టర్ దగ్గర నేరుగా తీసుకునే డబ్బులకంటే ఒకేసారి బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువ డబ్బులు కాజేయొచ్చనే ప్లాన్ వేసిన మహిళ, ఆ యువకుడి సాయం కోరింది. ఇద్దరూ కలసి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే ఆ డాక్టర్ దగ్గర దొరికిపోయారు. కానీ డాక్టర్ కూడా తప్పు చేశాడు కాబట్టి, తేలుకుట్టిన దొంగలా ఉన్నాడు. డబ్బులు భారీగా నష్టపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. 

ఎలా చేశారంటే..?
తరచూ ఆ మహిళతో కావలిలోనే ఓ ప్రాంతంలో కలిసేవాడు డాక్టర్. ఈసారి కూడా ఆమె అతడిని అక్కడికే రమ్మన్నది. కానీ మనసులో ప్లాన్ వేరే ఉంది. సరిగ్గా డాక్టర్ తో ఆ మహిళ కలసి ఉన్న సమయంలో వెంటనే ఆ సీన్ లోకి పోలీస్ ఎంట్రీ ఇచ్చాడు. ఖాకీ డ్రెస్ వేసుకున్న యువ పోలీస్ ని చూసి డాక్టర్ షాకయ్యాడు. తమ పరువు తీయొద్దన్నాడు. 10 లక్షల రూపాయలకు బేరం కుదిరింది. అయితే ఇప్పుడే అంత డబ్బు ఇవ్వలేనన్న డాక్టర్, తమ వ్యవహారం బయట చెప్పొద్దంటూ అప్పటికప్పుడు 30వేలు క్యాష్ ఇచ్చాడు. మరో 90వేల రూపాయలు ఆన్ లైన్లో ట్రాన్స్ ఫర్ చేశాడు. పనిలో పనిగా మహానటి లాగా నటించిన సదరు మహిళ కూడా తన వంటిపై బంగారం అంతా వలిచి పోలీస్ కి ఇచ్చేసింది. 

ఎలా దొరికిపోయారంటే..?
పోలీస్ డబ్బులతో వెళ్లిపోయాడు, మళ్లీ డబ్బులివ్వాలని వేధించాడు. అయితే ఈలోగా సదరు ఫోన్ పే నెంబర్ గురించి డాక్టర్ ఆరా తీశాడు. అందులో అతడు పోలీస్ కాదని తేలింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ నాయకుడి కొడుకుగా నిర్థారణ అయింది. దాంతోపాటు ఆ మహిళే కావాలని ఆ యువకుడిని పిలిపించి పోలీస్ వేషంలో వచ్చేలా చేసి ఓ పథకం ప్రకారం తన బంగారు నగలు కూడా ఇచ్చేసిందని అర్థమైంది. దీంతో డాక్టర్ లబోదిబోమంటున్నాడు. 

పోలీస్ వేషంలో వచ్చిన యువకుడు, అతడితోపాటు సీన్ రక్తికట్టించిన ఆ ప్రియురాలు ఇద్దరూ కలసి డాక్టర్ కి టోపీ పెట్టారు. 10లక్షల రూపాయల పెద్ద మొత్తానికే టార్గెట్ పెట్టడంతో చివరకు దొరికిపోయారు. ఈ వ్యవహారం కావలితోపాటు నెల్లూరు జిల్లాలో కూడా సంచలనంగా మారింది. పోలీసులు మాత్రం దీనిపై పెదవి విప్పడంలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget