(Source: ECI | ABP NEWS)
Kurnool Bus Fire Acciden: ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
కర్నూల్ జిల్లా బస్సు దగ్ధమైన ఘటనలో నెల్లూరు జిల్లాలోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలుమృతి చెందడంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు

నెల్లూరు: కర్నూల్ జిల్లా బస్సు దగ్ధమైన ఘటనలో నెల్లూరు జిల్లాలోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వింజమూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో రమేష్ (37) గోళ్ళ అనూష (32), మనీష్ (12) మణీత్వా (10) మృతిచెందారు.
రమేష్ గత 15 ఏళ్లుగా బెంగళూరులోని హిందుస్థాన్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. కంపెనీ ట్రిప్పులో భాగంగా కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాదు నుంచి తిరుగు ప్రయాణంలో కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో నేషనల్ హైవే 44పై బైకు, బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనం కాగా, కొందరు అద్దాలు ధ్వంసం చేసి ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి..
అమరావతి: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామని నారాయణ తెలిపారు.
VIDEO | Private bus catches fire in Andhra Pradesh's Kurnool, killing 12. TDP MP Byreddy Shabari said:
— Press Trust of India (@PTI_News) October 24, 2025
"This bus caught fire in minutes. We could save about 19 people. They have been admitted to the hospital. We couldn't identify the rest of the people because their bodies were… pic.twitter.com/yfaPyjdsTe
దుబాయ్ నుంచి స్పందించిన సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం అక్కడికి వెల్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరణాల సంఖ్య పెరగకుండా తక్షణం వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనిత సైతం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి అనిత, డీజీపీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించనున్నారు.






















