Bus Accident Helpline Numbers: కర్నూలు బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే
Kurnool Travels bus accident incident : కర్నూలు బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే

కర్నూలు: ఒక్క ప్రమాదం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్దమైన ఘటనలో 20 మంది వరకు సజీవదహనం అయ్యారు. దాదాపు 12 మంది కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
- కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305
- కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059
- ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061
- కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075
- కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010
బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు అని అధికారులు తెలిపారు.

కర్నూలు బస్సు ప్రమాదం నుంచి బయటపడింది వీరే
కర్నూలు : వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్నిప్రమాదానికి గురై కాలిపోయిన ప్రమాదం నుంచి కొందరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎమర్జెన్సీ డోర్ అద్దాలు బద్దలుకొట్టి వారు బస్సు నుంచి కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. వారి పేర్లు ఇవే అని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.
సత్యనారాయణ
శ్రీలక్ష్మి
నవీన్ కుమార్
అఖిల్
హారిక
జష్మిత
అకీర
రమేష్
జయసూర్య
సుబ్రహ్మణ్యం
రామిరెడ్డి
వేణుగోపాల్ రెడ్డి

డీఎన్ఏ నమూనాల సేకరణ..
మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాల సేకరిస్తామన్నారు సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంటుకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఘటన స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
ఫోరెన్సిక్ వైద్యులను ఘటన స్థలానికి పంపించాం. మృతదేహాల తరలింపునకు మహాప్రస్తానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. 12 మంది స్వల్పగాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉంది" అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.






















