By: ABP Desam | Updated at : 06 Jan 2023 03:17 PM (IST)
మాజీ మంత్రి నారాయణ(File Photo)
పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. ఈయన బెయిల్ రద్దు చేయాలన్ని హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు. దీనిపై విచారణ వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
రవీంద్రభట్, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ కేసును విచారిస్తే... నారాయణ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్ధ లూద్రా, గుంటూరు ప్రమోద్, గుంటూరు ప్రేరణ వాదనలు వినిపించారు. పదోతరగతి పేపర్ లీక్ చేసి ఆరోపణలపై నారాయణపై కేసు నమోదైంది. ఆయకు చిత్తూరు జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. దీన్ని హైకోర్టు రద్దు చేసింది. వెంటనే సరెండర్ కావాలంటూ నారాయణను ఆదేశింది. దీనిపై నారాయణ సుప్రీం కోర్టుకు వెళ్లారు. విచారించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని నారాయణ స్కూల్స్ బ్రాంచీలో టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లీక్‌లకు సూత్రధారి నారాయణ అని.. పోలీసులు కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.
నారాయణపై పలు కేసులు !
గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణపై ప్రస్తుత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. అమరావతి భూముల కేసులని..అలైన్ మెంట్ కేసులనీ పలు రకాలుగా పెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన రోజే ఆయనపై.. మరో ఎఫ్ఐఆర్ వెలుగు చూసింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో ఆయనపై కేసు నమోదు చేశారు. రెండింటిలో ఏ కేసులో అరెస్ట్ చేశారో స్పష్టత రాలేదు. చివరికి ప్రశ్నాపత్రాల ేకసులో అరెస్టయినట్లుగా తేలడం.. బెయిల్ మంజూరు కావడం జరిగాయి. తర్వాత అలైన్ మెంట్ కేసులోనూ నారాయణ బెయిల్ తెచ్చుకున్నారు. ఆయనను ఇటీవల ఆయనింట్లోనే సీఐడీ ప్రశ్నించింది.
Kotamreddy vs Balineni: నా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపిస్తా, కాచుకో బాలినేనీ!: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
అంతా కల్పితమే - కోటం రెడ్డి ఎపిసోడ్లో గాలి తీసేసిన మంత్రి కాకాణి
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌గా భారతి హోళికేరి
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !