News
News
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ కుమారుడి అరెస్టు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో దర్యాప్తును వేగం పెంచాయి దర్యాప్తు సంస్తలు. ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు ఇస్తున్న సమాచారంతో మరికొందర్ని అరెస్టు చేస్తోంది.

FOLLOW US: 
Share:

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మరో మలుపు తిరిగింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడిని ఈడీ అరెస్టు చేసింది. గత వారం రోజులుగా ఈ కేసుతో సంబంధం ఉన్న వేర్వేరు వ్యక్తులను రోజుకొకర్ని అరెస్టు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఎంపీ కుమారుడిని అందులోనూ అధికార పార్టీకి చెందిన ఎంపీ కుమారుడిని అరెస్టు చేయడం కలకలం రేపింది. 

గత కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. తాజాగా ఇవాళ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాగుంట రాఘవను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. ఇప్పటికే అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న విచారణకు పిలిచిన ఈడీ అధికారులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అరెస్టు చేశారు.

ఈ స్కామ్‌ కేసులో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీ కేంద్రం పని చేసే చారియట్‌ మీడియాకు చెందిన రాజేశ్‌ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు ఈయన తరలించారని రాజేశ్ జోషిపై ఆరోపణలు ఉన్నాయి. తమ ఆధీనంలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. రాజేష్ జోషిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు.

అంతకు ముందు రోజు హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఈయన గతంలో ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తుల వద్ద సీఏగా పని చేశారు. రామచంద్ర పిళ్లైకి కూడా చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేశారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. బుచ్చిబాబు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. గతంలో ఆయన ఇంట్లో సోదాలు కూడా చేసింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కేసులో ఇప్పటి వరకు సాగిన విచారణ, ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించి బుచ్చిబాబు పాత్రపై నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. అందుకే ఈ ఉదయం తెల్లవారేసరికి బుచ్చిబాబును అరెస్టు చేసింది సీబీఐ.  

ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్‌ మల్హోత్రాను కూడా ఈడీ అధికారులు ఫిబ్రవరి 8 అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతణ్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నో మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ ఈ మధ్యే వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ, ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం, ఆప్‌ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది ఆప్. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని ఈడీ తెలిపింది. ఆ చార్జ్‌షీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చేర్చింది. కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది ఈడీ. మొదటి ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చిన ఈడీ ఈసారి ఏకంగా కేజ్రీవాల్ పేరునీ జోడించింది.

Published at : 11 Feb 2023 09:00 AM (IST) Tags: Delhi Liquor Scam Delhi News YSRCP MP Son Magunta Srinivas Reddy

సంబంధిత కథనాలు

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

Nellore Police: నెల్లూరులో వెరైటీ ఛేజింగ్- కాల్వలో ఈత కొట్టిన నిందితుడు, పోలీసులకు చుక్కలు

Nellore Police: నెల్లూరులో వెరైటీ ఛేజింగ్- కాల్వలో ఈత కొట్టిన నిందితుడు, పోలీసులకు చుక్కలు

కోతల సమయంలో కన్నీరు మిగిల్చిన అకాల వర్షం

కోతల సమయంలో కన్నీరు మిగిల్చిన అకాల వర్షం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్