అన్వేషించండి

నెలాఖరులోగా నెల్లూరు పవర్ ప్లాంట్ మూడో యూనిట్ పూర్తి 

రాష్ట్ర విభజన అనంతరం ఏపీని విద్యుత్ కొరత వేధించింది. వేధిస్తోంది కూడా. ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమృద్ధిగా ఉంది. ఏపీని విద్యుత్ కొరత వేధించింది. వేధిస్తోంది కూడా. ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. 

ప్రస్తుతం మూడో యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పరిశీలనలోనే 300 మెగావాట్లకుపైగా సామర్థ్యంతో మూడో యూనిట్ నడవటం శుభపరిణామం అంటున్నారు అధికారులు. దేశంలోనే తొలిసారి సూపర్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ థర్మల్ పవర్ ప్లాంట్‌ త్వరలో వాణిజ్య ఉత్పాదన మొదలు పెడుతుంది. ఈ నెలాఖరుకు మూడో యూనిట్ ని కూడా జాతికి అంకితం చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు కాగా, పరీక్షల సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ, జనరేటర్‌ లోపాలు, అలైన్‌మెంట్‌ వంటి సమస్యలు వచ్చాయి. ఇంజినీర్లు వాటన్నింటిని గుర్తించి పరిష్కరించగలిగారు. మొదట్లో బొగ్గు కొరత ఉన్నా కూడా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ తర్వాత బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టులోని మూడు యూనిట్లకు పలు అనుకూలాంశాలు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. ప్రత్యేక బాయిలర్‌, చిమ్నీ నిర్మాణం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి కన్వేయరు బెల్ట్‌ ద్వారా బొగ్గు సరఫరా... ఇలా అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకోసం, పవర్‌ హౌస్‌, బొగ్గు యార్డు కూడా ఇక్కడ రూపుదిద్దుకుంది. 

మరోవైపు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ని 28 సంవత్సరాలపాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చేందుకు కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతోనే ఈ ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ప్రస్తుతం ఏపీ జెన్‌ కోకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. నేలటూరులో ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న గాయత్రి, ఎన్సీపీ థర్మల్‌ పవర్ ప్రాజెక్టుల్లో యూనిట్‌ విద్యుత్ ఉత్పత్తికి రూ.2.60 వరకు ఖర్చవుతోంది. ఏపీ జెన్ కో లోని యూనిట్‌ కి రూ.3.90 ఖర్చవుతోందని తెలుస్తోంది. దీనివల్ల నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు థర్మల్‌ ప్రాజెక్ట్ లకు విదేశాల నుంచి తక్కువ ధరకు బొగ్గు వస్తోందని, దీంతో వాటిలో తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అంటున్నారు. మరి ఏపీ జెన్ కో వారికంటే అధిక ధరకు ఎందుకు బొగ్గుని దిగుమతి చేసుకుంటుందో తేలాల్సి ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ దశలో మూడో యూనిట్ కూడా పూర్తి కావడం, ఈ నెలాఖరులోనే దాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధపడటంతో.. ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget