అన్వేషించండి

Sonu Sood: నెల్లూరు జిల్లాకు చేరిన సోనూ సూద్ సాయం.. 

కరోనా లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికులకు ఆపన్నహస్తం అందించిన సోనూ సూద్. ఇప్పుడు నెల్లూరు జిల్లావాసులకు అండగా నిలబడ్డారు. దాదాపు 2 వేల కుటుంబాలకు సాయం అందించారు.

కరోనా లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికులకు సాయం అందించిన సోనూ సూద్.. ఇప్పుడు నెల్లూరు జిల్లావాసులకు అండగా నిలబడ్డారు. దాదాపు 2 వేల కుటుంబాలకు ఆయన నిత్యావసరాలు పంపించారు. ప్లాస్టిక్ బకెట్, చాప, దుప్పట్లు, ఇతర నిత్యావసరాలను అందించారు. కోవూరు మండలంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సోనూ సూద్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు, సాయాన్ని అందించారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇటీవల వర్షాలకు నెల్లూరు జిల్లాలో దాదాపు 10 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు కోల్పోయారు, పంట నష్టం జరిగింది. ఉపాధి కోల్పోవడంతో చాలామంది రోజుకూలీలు ఆర్థికంగా ఇబ్బందిపడ్డారు. వారందరికీ ఇప్పుడు ఆర్థిక సాయం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సినీ నటుడు సోనూ సూద్ కూడా తనవంతుగా నెల్లూరు జిల్లాలోని బాధితులకు అండగా నిలిచారు. నేరుగా తన సాయాన్ని నెల్లూరు జిల్లాకు పంపించారు. 

నెల్లూరు జిల్లాతో అనుబంధం.. 
నెల్లూరు జిల్లాకు సోనూసూద్ కి మంచి అనుబంధం ఉంది. గతంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఓ ఆక్సిజన్ ప్లాంట్ ని ఉచితంగా అందజేశారు సోనూసూద్. కరోనా సమయంలో కూడా నెల్లూరు జిల్లా వాసులకు ఆయన సాయాన్ని అందచేశారు. తాజాగా వరద బాధితులను కూడా ఆయన ఆదుకున్నారు. సోనూసూద్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు నెల్లూరు జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని ఫోన్ ద్వారా తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించారు. Sonu Sood: నెల్లూరు జిల్లాకు చేరిన సోనూ సూద్ సాయం.. 

గొప్ప మనసున్న సోనూ సూద్.. 
ఇటీవలే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తెలుగు సినీ నటీనటులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల అభిమానంతో కోట్ల రూపాయలు సంపాదించిన హీరోలు, వరదల సాయంలో కనీసం సాయం చేయడానికి ముందుకు రావడంలేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వరదల సమయంలో ప్రజలకు సాయం చేసేవారని గుర్తు చేశారు. ఈ తరం నటీనటులు ప్రజలను మరచిపోయారని, కోట్లు సంపాదిస్తున్నా కనీసం అందులో ఎంతో కొంత ఇలాంటి విపత్తుల సమయంలో అయినా పంచిపెట్టడంలేదని అన్నారు. అయితే తెలుగు వారు కాకపోయినా సోనూ సూద్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున తొలి అడుగు వేశారన్నారు. తన సాయాన్ని పంపించారని తెలిపారు. 

దాదాపు 2వేల కుటుంబాలకు సరిపడా బకెట్లు, చాపలు, బెడ్ షీట్లు.. లారీలో పంపించారు సోనూ సూద్. కోవూరు మండలంలోని స్టౌబిడి కాలనీ, వారధి సెంటర్. సాలుచింతల ప్రాంతాల్లో సోనూ సూద్ పంపించిన సాయాన్ని పేదలకు అందించారు సోనూసూద్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. సాయం అందుకున్న బాధితులు సోనూ సూద్ కి కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget