Amaravati: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక కేంద్రం సంస్థ - నేషనల్ కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం
AP BJP: అమరావతిలో నేషనల్ కన్ స్ట్రక్షన్ అకాడమీని నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే గండికోటకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు.
National Academy of Construction is set to be established in Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. తాజాగా అమరావతిలో మరో కేంద్ర సంస్థ నెలకొల్పాలని నిర్ణయించింది. నేషనల్ అకాడమీ అప్ కన్‌స్ట్రషన్ ను నెలకొల్పేందుకు కేంద్రం నిర్ణయించిందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల యువత స్కిల్ డెవలప్‌మెంట్‌లో అభివృద్దిలో ముందడుగు వేస్తామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
🚨 Big boost for Andhra Pradesh! The National Academy of Construction (NAC) is set to be established in Amaravati, thanks to the visionary leadership of PM Shri @narendramodi.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 29, 2024
This step will strengthen Amaravati’s role as a hub for skill development, empowering youth and driving… pic.twitter.com/9Jn44m5lXj
ఇప్పటికే అమరావతికి కేంద్రం బడ్దెట్‌లోనే రూ. పదిహేను వేల కోట్ల సాయం కేటాయించింది. ఈ నిధులను ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి.
Also Read: సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు
మరో వైపు అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్ తరహాలో గండికోటను అభివృద్థి చేసే బాధ్యతను కూడా కేంద్రం తీసుకుంది. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లను మంజూరు చేసింది. చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరించడానికి, పర్యాటకంగా అభివృద్థి చేయడానికి కేంద్రప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేసింది. కోట అభివృద్థితో పాటు స్థానిక నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆ నిధులను వినియోగించనున్నారు. గండికోట ప్రాభవం, ప్రాశస్త్యం భవిష్యత్ తరాలకు తెలియజేసేలా అభివృద్థి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
రాయలసీమలోని గండికోట అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని @gssjodhpur గారు వారి కేంద్ర పర్యటక శాఖ ₹77.91 కోట్లను మంజూరు చేసింది. ముందుగా వీరికి ధన్యవాదాలు.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 29, 2024
ఈ నిర్ణయం కారణంగా మెరుగైన రహదారులు, పర్యాటకులు వసతి సౌకర్యాలు మరియు ఇతర సౌకర్యాలు మెరుగుపరచడానికి,… https://t.co/6ZAiPVbJ4F
ఎన్డీఏలో కీలకంగా ఉన్న పార్టీలు ఏపీలో ఉండటంలో నిధులు దండిగా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక సాయం అందిస్తోంది.
Also Read: నాడు అనంతబాబు నేడు శ్రీకాంత్- హత్య కేసులో బెయిల్‌పై విడుదలైనప్పుడు చేస్తున్న హంగామాపై విమర్శలు